Allu Arjun Multiplex: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి దక్కనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. అయినప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపు అయితే వస్తుంది. మరి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమువైపు తిప్పుకోవాలని చూస్తున్న స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటున్న సందర్భంలో ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా భారీ విజయాన్ని సాధించిన అల్లు అర్జున్ సైతం పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అట్లీ (Atlee) డైరెక్షన్లో చేస్తున్న సినిమా పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… ఇక సినిమాల విషయం పక్కన పెడితే ప్రస్తుతం అల్లు అర్జున్ బిజినెస్ పనులను కూడా చూసుకుంటున్నాడు. వైజాగ్ లో భారీ రేంజ్ లో ఇనార్బిట్ మాల్ ఎఎఎ ను నిర్మించడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇక 2023 వ సంవత్సరంలోనే దీనికి సంబంధించిన పనులను ప్రారంభించినప్పటికి ఇప్పుడు దానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నట్టుగా తెలుస్తున్నాయి. ఇక వైజాగ్ లో 13 ఎకరాల్లో మల్టీప్లెక్స్ ను నిర్మించబోతున్నారు. మరి మొత్తానికైతే ఇప్పటివరకు ఏషియన్ మాల్స్ అన్నింటిలో ఇది చాలా పెద్ద మాల్ అని కూడా చెబుతున్నారు.
Also Read: కూలీ మూవీ మోనికా సాంగ్ లో డాన్స్ ఇరగదీసిన మంజుమ్మెల్ బాయ్స్ హీరో ‘సౌబిన్ షాహిర్’!
దీనికోసం ఏషియన్ సునీల్ అల్లు అరవింద్ ఇద్దరూ కలిసి రీసెంట్ గా వైజాగ్ వెళ్ళి అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించినట్టుగా తెలుస్తోంది…మరి మొత్తానికైతే ఈ పనులను శరవేగంగా పూర్తి చేసి 2026 సమ్మర్ లో ఈ మాల్ ను ప్రారంభించాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
ఇక దీంట్లో ఉండే స్క్రీన్స్ ని కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో క్రియేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఫర్నిచర్ మొత్తం ఫారాన్ నుంచి తెప్పిస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మాల్ చాలా హైలెట్ గా నిలవబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ కి హైదరాబాద్లో ఒక మాలైతే ఉంది. మరి దానికి మించి ఈ మాల్ ను రెడీ చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం మన స్టార్ హీరోలందరు బిజినెస్ ల మీద ఇన్వెస్ట్ చేస్తూ చాలా బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. రీసెంట్ గా ఈ మాల్ కి సంబంధించిన ఫర్నిచర్ టెక్నాలజీ ఎలా ఉండాలి అనే దాని మీద అల్లు అర్జున్ ఒక నిర్ణయాన్ని తీసుకొని వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి తను ఎలాగైతే దీని డిజైన్ చేయాలనుకుంటున్నాడో ఆయన ఊహకు తగ్గట్టుగానే దీన్ని రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది…