Ram Charan And Sandeep Reddy Vanga: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి సాధ్యం కానీ రీతిలో గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న హీరోలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మంచి విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం…
Also Read: కూలీ మూవీ మోనికా సాంగ్ లో డాన్స్ ఇరగదీసిన మంజుమ్మెల్ బాయ్స్ హీరో ‘సౌబిన్ షాహిర్’!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ (Mega Power Star) గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో రామ్ చరణ్ (Ram Charan)…ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిద్యమైన కథాంశం అయితే ఉంటుంది. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు(Bichhibabu) దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ డిఫరెంట్ పాత్రను పోషించడమే కాకుండా తనకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించి అలాగే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తన తోటి హీరోలందరూ పాన్ ఇండియాలో మంచి విజయాలను దక్కించుకోవడమే కాకుండా ఇతర హీరోలెవ్వరికి సాధ్యం కానీ రీతిలో రికార్డులు నెలకొల్పుతున్నారు… రామ్ చరణ్ సైతం పెద్ది (Peddi) సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో రామ్ చరణ్ (Ram Charan) చేయబోతున్న సినిమా ఆగిపోయిందనే వార్తలు వస్తున్నప్పటికి రామ్ చరణ్ తన తర్వాత సినిమాని సందీప్ రెడ్డి వంగ (Sundeep Reddy Vanga) డైరెక్షన్లో చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు సందీప్ వంగ, రామ్ చరణ్ కాంబినేషన్లో ఒక సినిమా కూడా రాలేదు. సందీప్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటిస్తే అతనికి సపరేట్ గుర్తింపు వస్తుందనే ఉద్దేశ్యంతో తమ అభిమానులైతే కోరుకుంటున్నారు.
ప్రస్తుతం సందీప్ రెడ్డివంగా ప్రభాస్ (Prabhas) స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే రాంచరణ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు… సందీప్ రెడ్డివంగా అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సి ఉన్నప్పటికి వాళ్లిద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఆ సినిమా నుంచి సందీప్ తప్పుకున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట రామ్ చరణ్ – సందీప్ వంగ కాంబినేషన్లో రాబోతున్న సినిమా పెను రికార్డులను క్రియేట్ చేసి సందీప్ రెడ్డివంగా కి మంచి గుర్తింపు తీసుకొస్తుందని ఆయన భావిస్తున్నాడు…ఇక ఈ మూవీ లో రామ్ చరణ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు అనే విషయం కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది…