Pushpa 2 The Rule: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం సక్సెస్ మీట్స్ కొన్ని అనుకోని సంఘటనల వల్ల సినిమా రన్నింగ్ సమయంలో జరుపుకోలేకపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సంఘటనల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజు రాత్రి జరిగిన ఈ దురదృష్టకరమైన సంఘటన కారణంగా టాలీవుడ్ లో అనేక అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే దేశం మొత్తం గర్వించే రేంజ్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న తర్వాత ఆడియన్స్ కి మరోసారి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియచేయడానికి నిన్న ఒక థాంక్యూ మీట్ ని ఏర్పాటు చేసారు. ఈ థాంక్యూ మీట్ కి కేవలం అల్లు అర్జున్ మరియు మూవీ టీం కి సంబంధించిన వాళ్ళు మాత్రమే పాల్గొన్నారు. గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా అభిమానులను ఈ ఈవెంట్ కి ఆహ్వానించలేదు. ఒక ప్రైవేట్ హాల్ లో మూవీ టీం సమక్ష్యం లో ఈ ఈవెంట్ జరిగింది.
ఈ ఈవెంట్ లో డైరెక్టర్ సుకుమార్ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికి పేరుపేరున కృతఙ్ఞతలు తెలియచేస్తూ దాదాపుగా 37 నిమిషాల వరకు మాట్లాడాడు. ముఖ్యంగా ఆయన హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందాయి. ఆయన మాట్లాడుతూ ‘ నీ గురించి ఎంత చెప్పినా తక్కువే డార్లింగ్..నన్ను ఇండస్ట్రీ లో గుడ్డిగా నమ్మే హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది అల్లు అర్జున్ మాత్రమే. పుష్పకి కానీ, పుష్ప 2 కి కానీ నేను కేవలం ఆయనకు ఫస్ట్ హాఫ్ స్టోరీ మాత్రమే చెప్పాను, చాలు ఇక ఆపేయ్, ఇక్కడితో అయిపోయింది ఈ సినిమా, మనం చేస్తున్నాం అని అన్నాడు. పూర్తి స్టోరీ ఒక్కసారి కూడా వినలేదు, నా మీద అల్లు అర్జున్ పెట్టిన నమ్మకం అలాంటిది’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఒక రోజు నేను పార్క్ లో వెళ్తుంటే ఇద్దరు పెద్ద వయస్సు ఉన్నవాళ్ళు నన్ను కలిశారు. అల్లు అర్జున్ నటన గురించి మాట్లాడుతూ SV రంగారావు స్థాయి నటుడయ్యా అని అన్నారు. అప్పుడు పక్కనే ఉన్న మరో పెద్దాయన SV రంగారావు గారు అల్లు అర్జున్ లాగా డ్యాన్స్ వేయగలడా, అసాధ్యం అని చెప్పుకొచ్చాడు.ఇది నేను చెప్తే ట్రోల్స్ చేయొచ్చు కానీ, జరిగిన వాస్తవం ఇదే. ఆ స్థాయికి వెళ్ళిపోయావు డార్లింగ్. నిన్ను చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు అభిమానిస్తున్నారు’ అంటూ ఎంతో ఎమోషనల్ గా అల్లు అర్జున్ గురించి ఆయన చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా చక్కర్లు కొడుతోంది. సినిమా సినిమాకి అల్లు అర్జున్ తనని తానూ మార్చుకుంటున్న తీరు నిజంగా అద్భుతం అనే చెప్పాలి. తదుపరి చిత్రంతో ఆయన ఆడియెన్సు కి ఏ రేంజ్ కిక్ ఇవ్వబోతున్నాడో చూడాలి.