Today Horoscope
Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశరాసులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉండనుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. మరి కొన్ని రాశుల వారు ప్రయాణాలు చేయవలసి వస్తే జాగ్రత్తగా ఉండాలి. వేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారు ఇన్నాళ్లు చేసిన కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఇతరుల ప్రేమను పొందు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. దీంతో ఉల్లాసంగా ఉంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. కొన్ని విషయాల్లో అనుకోకుండా అని అదృష్టం వరిస్తుంది. అయితే కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం ఉంటుంది. జీవిత భాగస్వామితో మాటలను అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): వ్యాపారంలో లాభాలు అధికంగా ఉంటాయి. అయితే కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తే వెంటనే వెళ్లాలి. ప్రియమైన వారికోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు. విద్యార్థుల నుంచి శుభవార్తలు వింటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. విహారయాత్రలకు కలిసి వెళ్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ఒత్తిడి ఉంటుంది. వివాహం చేసుకునే వారికి ప్రతిపాదనలు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఓ విషయంపై చర్చిస్తారు. వ్యాపారులు భాగస్వాములతో కొత్త ఒప్పందాలను ఏర్పరచుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు అధికంగా లాభాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : వివాహితులకు మానసిక ఆందోళన ఉంటుంది. ఏమైనా వారి కోసం ఏదో చేయాలని అనుకుంటారు. కానీ మనస్పర్ధలు కారణంగా గొడవలు పెరుగుతాయి. వ్యాపారులకు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా చేయాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు జీవిత భాగస్వామితో సాంహిత్యం పెరుగుతుంది. ఇంటి వస్తువుల కోసం ఆధారంగా ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారాలు అధికంగా లాభాలు పొందుతారు. విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. వాహనాలపై ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రాలకు వెళ్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులకు ముందడుగు వేస్తారు. అయితే పెద్దల సలహా తీసుకోవడం మంచిది. తెలియని వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యులపై ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. పెయింటింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడులను గురచి మంచి లాభాలు వస్తాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. వివాహితులు సంతోషంగా ఉంటారు. పిల్లలతో కలిసి షికారుకు వెళ్తారు. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయంలో పెద్దల సలహా అవసరం. ఇతరులతో వాగ్వాదానికి దిగవద్దు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఆలయ వనరులు పెరుగుతాయి. దీంతో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు ఉంటాయి. ఇవి ఆర్థికంగా ప్రయోజనాలను కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది. వ్యాపారులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.