https://oktelugu.com/

Allu Arjun holds Indian Flag: అమెరికాలో భారత జెండా పట్టి ‘తగ్గేదేలే’ అంటున్న అల్లు అర్జున్

Allu Arjun holds Indian Flag: స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా దేశం మొత్తం మీద వజ్రోత్సవాలు నిర్వహించుకున్నాం. ఆజాదీ అమృత్ మహోత్సవంలో భాగంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికాలో ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ తో పాటు ప్రఖ్యాత గాయకులు శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ సహా పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారి చేత ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 22, 2022 6:48 pm
    Follow us on

    Allu Arjun holds Indian Flag: స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా దేశం మొత్తం మీద వజ్రోత్సవాలు నిర్వహించుకున్నాం. ఆజాదీ అమృత్ మహోత్సవంలో భాగంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికాలో ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ తో పాటు ప్రఖ్యాత గాయకులు శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ సహా పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారి చేత ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ జాతీయ జెండా చేతబూని అమెరికా వీధుల్లో స్వాతంత్ర్య ప్రాధాన్యత గురించి చెబుతూ ర్యాలీ తీయడం సంచలనం కలిగిస్తోంది.

    Allu Arjun holds Indian Flag

    Allu Arjun

    న్యూయార్క్ నగరంలో ర్యాలీ జరిగింది. న్యూజెర్సీ, కనెక్టికట్, మన్ హట్టన్ లల్లో నివసించే భారతీయులు అధిక సంఖ్యలో పాల్గొని జెండా పట్టుకుని ర్యాలీ చేపట్టడంతో అందరు విధిగా పాల్గొని తమ మద్దతు ప్రకటించడం విశేషం. ఈ సందర్బంగా అల్లు అర్జున్ హిందీలో మాట్లాడటం అందరిని ఆశ్చర్యపరచింది. పుష్ప సినిమాలోని డైలాగులతో ఝుకేగా నహి అంటూ అందరిని ఆకట్టుకున్నారు. భారతీయుడిగా జన్మించినందుకు గర్వించాలని సూచించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఇండియా ఉండటం మనకు మరో గర్వకారణమని పొగిడారు.

    కరోనా ప్రభావంతో గత మూడేళ్లుగా ఈ కార్యక్రమం వాయిదా పడినా ఈసారి నిర్వహించడంతో అల్లు అర్జున్ హాజరై అందరిలో ఉత్సుకత పెంచారు. ప్రతిష్టాత్మక ర్యాలీకి గ్రాండ్ మార్షల్ గా వ్యవహరించేందుకు తనకు ఇదో గౌరవంగా చూస్తున్నానని అన్నారు. ర్యాలీలో అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం తెలిసిందే. దీంతో అమెరికా కేంద్రంగా స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాలు నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అర్జున్ చెప్పడం గమనార్హం. అమెరికా వీధుల్లో అల్లు అర్జున్ ర్యాలీ నిర్వహించి దేశభక్తిని చాటుకున్నారు.

    Allu Arjun holds Indian Flag

    Allu Arjun, Sneha Reddy

    పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 లో కూడా నటించేందుకు నిర్ణయించుకున్నారు. అమెరికా నుంచి రాగానే ఆ షూటింగ్ లో పాల్గొనన్నారు. దీంతో అమెరికాలో కూడా పుష్ప భారీ వసూళ్లు రాబట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుష్ప2 కూడా అదే రేంజ్ లో విజయం సాధిస్తుందని అందరు ఆశిస్తున్నారు. అమెరికాలో కూడా అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు సాధించింది. రెండు బిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లు రావడం తెలిసిందే.

    Tags