https://oktelugu.com/

Hero Nikhil: ఎందరో స్టార్ హీరోల వల్ల కాలేదు… కానీ నిఖిల్ చేసి చూపించాడు

Hero Nikhil: నార్త్ ఇండియాలో కార్తికేయ 2 దుమ్మురేపుతోంది. ఈ మూవీ రికార్డు కలెక్షన్స్ వైపుగా అడుగులు వేస్తుంది. రూ. 7 లక్షల పూర్ ఓపెనింగ్స్ తో మొదలైన ఈ మూవీ కోట్ల రూపాయలు కొల్లగొడుతుంది. 2014లో విడుదలైన కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 రికార్డు వసూళ్లు రాబడుతుంది. కేవలం మూడు రోజుల్లో కార్తికేయ 2 బ్రేక్ ఈవెన్ కావడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో కార్తికేయ 2 బయ్యర్లకు భారీగా లాభాలు పంచుతుంది. […]

Written By:
  • Shiva
  • , Updated On : August 22, 2022 / 06:38 PM IST
    Follow us on

    Hero Nikhil: నార్త్ ఇండియాలో కార్తికేయ 2 దుమ్మురేపుతోంది. ఈ మూవీ రికార్డు కలెక్షన్స్ వైపుగా అడుగులు వేస్తుంది. రూ. 7 లక్షల పూర్ ఓపెనింగ్స్ తో మొదలైన ఈ మూవీ కోట్ల రూపాయలు కొల్లగొడుతుంది. 2014లో విడుదలైన కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 రికార్డు వసూళ్లు రాబడుతుంది. కేవలం మూడు రోజుల్లో కార్తికేయ 2 బ్రేక్ ఈవెన్ కావడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో కార్తికేయ 2 బయ్యర్లకు భారీగా లాభాలు పంచుతుంది.

    Hero Nikhil

    హిందీలో కార్తికేయ 2 విజయం సాధించడం విశేషంగా మారింది. నార్త్ ఇండియాలో కార్తికేయ 2 చిత్రానికి కనీస ప్రమోషన్స్ నిర్వహించలేదు. దీంతో మొదటి రోజు కేవలం రూ. 7 లక్షల వసూళ్లు మాత్రం దక్కాయి. అయితే మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా…. రోజు రోజుకు వసూళ్లు పెంచుకుంటూ పోతుంది. ఈ శనివారం కార్తికేయ 2 చిత్రానికి రూ. 3.04 కోట్లు రాబట్టింది.

    కార్తికేయ 2 తెలుగులో బంపర్ హిట్ నమోదు చేసింది. అలాగే హిందీలో భారీ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. కార్తికేయ 2 ఫుల్ రన్ లో యాభై కోట్లకు పైగా వసూళ్లు ఈజీగా సాధిస్తుంది. ఇప్పటి వరకు రూ. 11 కోట్ల వసూళ్లు సాధించిన ఈ మూవీ ఎవరూ ఊహించని నంబర్ నమోదు చేయనుంది. హిందీలో ఈ స్థాయి ఆదరణ దక్కడం విశేషం. ఎందరో స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానీ ఈ ఫీట్ నిఖిల్ చేసి చూపించాడు. మరి కార్తికేయ 2 విజయంతో ఆయన కూడా పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో చేరినట్లు అయ్యింది.

    Karthikeya 2

    దర్శకుడు చందూ మొండేటి కార్తికేయ 2 చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు. కమెడియన్ శ్రీనివాస రెడ్డి కీలక రోల్ చేశారు. ఓ సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న నిఖిల్ కార్తికేయ 2 విజయంతో ఫార్మ్ లోకి వచ్చాడు. ఆయన పేరు దేశవ్యాప్తంగా మరుమరుగుతుంది. ఎంతో నమ్మకంతో చేసిన కార్తికేయ 2 ఆయనకు భారీ విజయం కట్టబెట్టింది. నిఖిల్ ఓ రేంజ్ లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    Tags