Allu Arjun SIIMA: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) తన తోటి పాన్ ఇండియన్ స్టార్ హీరోల మీద గత కొన్నేళ్ల నుండి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ దగ్గర నుండి అవార్డ్స్ వరకు వన్ సైడ్ డామినేషన్ చూపిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. ‘అలా వైకుంఠపురంలో’ చిత్రంతో మొదలైన అల్లు అర్జున్ జైత్ర యాత్ర ‘పుష్ప’ సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్ కి ఎగబాకింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఖాన్స్ కంటే ఎక్కువ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది అల్లు అర్జున్ మాత్రమే. ఇప్పుడు ఆయన టార్గెట్ పాన్ ఇండియా ని దాటి పాన్ వరల్డ్ రేంజ్ కి ఎగబాకింది. అట్లీ తో ప్రస్తుతం ఆయన చేస్తున్న చిత్రం తో పాన్ వరల్డ్ రేంజ్ లో తన సత్తా ఏంటో చూపించే ప్రయత్నం లో ఉన్నాడు.
ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ రీసెంట్ గానే దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో పుష్ప 2 చిత్రం లో అద్భుతంగా నటించినందుకు గాను ఉత్తమ నటుడు క్యాటగిరీలో అవార్డు ని సొంతం చేసుకున్నాడు. బాగా గమనిస్తే అల్లు అర్జున్ కి సైమా అవార్డ్స్ లో కూడా ఒక అరుదైన రికార్డు ఉంది. వరుసగా ఆయన గత మూడు సినిమాలకు సైమా అవార్డ్స్ ని అందుకున్న హీరో గా ఆయన సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 2020 వ సంవత్సరం తో ‘అలా వైకుంఠపురంలో’, 2021 వ సంవత్సరం లో ‘పుష్ప’, 2024 వ సంవత్సరం లో ‘పుష్ప 2’ చిత్రాలకు గాను ఆయన ఉత్తమ నటుడు క్యాటగిరీ లో అవార్డ్స్ ని సొంతం చేసుకున్నాడు. ఇలా టాలీవుడ్ లో వరుసగా చేసిన మూడు సినిమాలకు ఉత్తమ నటుడు క్యాటగిరీ లో అవార్డు ని అందుకున్న హీరో మరొకరు లేరట. ఆ అరుదైన రికార్డు ని కూడా కైవసం చేసుకున్నాడు అల్లు అర్జున్.
అందుకే ఆయన దుబాయి లో టాలీవుడ్ కి చెందిన ప్రతీ ఒక్కరికి ఒక గ్రాండ్ పార్టీ ని ఏర్పాటు చేసాడట. సైమా అవార్డ్స్ కి వచ్చిన ప్రతీ టాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్స్, దర్శక నిర్మాతలు ఈ పార్టీ కి హాజరు అయ్యినట్టు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఆయన ఇదే విధంగా చేసిన ప్రతీ సినిమా తో అవార్డుని అందుకుంటాడో లేదో చూడాలి. ఇప్పటి వరకు అల్లు అర్జున్ తన ఫిల్మోగ్రఫీ మొత్తం మీద సంపాదించిన అవార్డులు 50 కి పైగానే ఉన్నాయట. ఆయనకు దరిదాపుల్లో మరో స్టార్ హీరో లేకపోవడం గమనార్హం. ఇలా ఒక పక్క రికార్డ్స్, మరోపక్క అవార్డ్స్ విషయం లో అల్లు అర్జున్ తన తోటి స్టార్ హీరోల మీద తిరుగులేని ఆధిపత్యం చూపిస్తున్నాడు.