https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ కి మంచి మార్కెట్ ఉంది… కానీ ఎందుకు అలా చేస్తున్నాడు..

Allu Arjun: ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతుంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే వారు చేస్తున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది...

Written By:
  • Neelambaram
  • , Updated On : October 10, 2024 / 07:28 PM IST
    Follow us on

    Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు అల్లు అర్జున్… ఇక పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన విషయం మనకు తెలిసిందే. ఇక పుష్ప సినిమా తెలుగులో పెద్దగా సక్సెస్ సాధించినప్పటికి బాలీవుడ్ లో మాత్రం ఈ సినిమాకి ఘనవిజయం దక్కింది. ఇక ముఖ్యంగా అక్కడి జనాలు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారనే చెప్పాలి. అలాంటి సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు సినిమాతో మరొకసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కి పాన్ ఇండియాలో భారీ మార్కెట్ అయితే ఉంది. ప్రస్తుతం ఆయన గురించి ఇండస్ట్రీ వర్గాలన్నింటిలో చర్చలైతే జరుగుతున్నాయి. ఆయన నుంచి వచ్చే పుష్ప 2 సినిమా ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించబోతుంది అనే విషయంలోనే చాలామంది ఆశ్చర్యంతో ఎదురుచూస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో అల్లు అర్జున్ ఎందుకు కాంట్రవర్సి అయ్యేలా కామెంట్లు చేయడం, అలాంటి వైఖరి తో ఎందుకు వ్యవహరిస్తున్నారు అంటూ కొంతమంది కామెంట్లైతే చేస్తున్నారు. ఇక మొత్తానికైతే వాళ్ళు చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తున్నాడు.

    ఇక ఆయన చేసిన చేష్టల వల్లనే ఆయనకి మార్కెట్ పరంగా భారీ ఇబ్బందులైతే ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటూ చాలామంది చాలా రకాల కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ వైఖరి మార్చుకొని పవన్ కళ్యాణ్ మీద గాని, ఇతర వ్యక్తుల మీద గాని కామెంట్లు చేయకుండా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తే ఆయన తప్పకుండా స్టార్ హీరోగా ఎదుగుతాడు.

    అలాగే ఆయన మీద ప్రేక్షకులందరిలో ఒక సాఫ్ట్ ఇంప్రెషన్ అయితే పెరుగుతుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేస్తే మాత్రం ప్రేక్షకుల్లో కూడా ఆయన మీద నెగిటివ్ టాక్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి… ఏది ఏమైనప్పటికీ తమకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడానికి చాలామంది హీరోలు కష్టపడుతున్న సమయంలో అల్లు అర్జున్ ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.

    కాబట్టి ఇప్పుడు తను ఎంత ఒదిగి ఉంటే అంత పైకి ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలా కాకుండా పిల్ల చేష్టలు చేస్తూ పవన్ కళ్యాణ్ కి గాని మిగతా హీరోలకి గాని ఎదురు వెళ్లడం ఇతరుల మీద కామెంట్స్ చేయడం లాంటివి చేస్తే మాత్రం ఆయన కెరియర్ భారీగా ఇబ్బంది పడే అవకాశాలైతే ఉన్నాయి…