Mathu Vadalara 2 : ఈ ఏడాది విడుదలైన చిన్న సినిమాలలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన చిత్రం ‘మత్తు వదలరా 2’. రితేష్ రానా దర్శకత్వంలో 2019 వ సంవత్సరం లో విడుదలైన ‘మత్తు వదలరా’ చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీ సింహా హీరోగా నటించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా పెద్ద హిట్ గా నిల్చింది. ఇప్పటికీ పలు థియేటర్స్ లో ఈ చిత్రం విజయవంతంగా రన్ అవుతుంది అంటే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ చిత్రం లోని కమెడియన్ సత్య కామెడీ కి ఎలాంటి వాడైనా కడుపుబ్బా నవ్వాల్సిందే. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాకి హీరో ఆయనే. కేవలం అతని కామెడీ వల్లే ఈ చిత్రం కమర్షియల్ గా ఇంత పెద్ద హిట్ అయ్యింది.
కేవలం 3 కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం, విడుదల తర్వాత 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది. అంటే పెట్టిన పెట్టుబడికి 6 రెట్లు లాభాలు వచ్చాయి అన్నమాట. అలా థియేటర్స్ లో సెన్సేషనల్ హిట్ గా నిల్చిన ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రేపు ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. రేపు అనగా నేటి అర్థ రాత్రి 12 గంటల నుండే నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వస్తుంది. ఎవరైనా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో మిస్ అయ్యుంటే వెంటనే చూసేయండి. ఈ వీకెండ్ మీరు కడుపుబ్బా నవ్వుకునే టైం పాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం నిలుస్తుంది.
అయితే చాలా వరకు థియేట్రికల్ సూపర్ హిట్ సినిమాలు ఓటీటీ లో విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకోవడం మనం చూసాము. అలాగే కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఓటీటీ లో మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. మరి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. థియేటర్స్ లో ప్రస్తుతం ‘దేవర’ చిత్రం తో పాటుగా సూపర్ స్టార్ రజనీకాంత్ ‘వెట్టియాన్’ చిత్రం కూడా మంచిగా నడుస్తుంది. కచ్చితంగా పండగ పూట ఈ రెండు సినిమాలకు వెళ్లాలని ఆడియన్స్ అనుకుంటారు, కానీ టికెట్స్ దొరకడం చాలా కష్టం కాబట్టి, ఇంట్లో చల్లగా కూర్చొని ‘మత్తు వదలరా 2’ చిత్రం చూసేయండి. శ్రీ సింహా, సత్య, ఫైరా అబ్దులా, సునీల్, వెన్నెల కిశోరె తదితరులు ఈ సినిమాలో నటించారు. హీరోయిన్ ఫైరా అబ్దుల్లా ఈ చిత్రం లో ఒక పాటని రాయడమే కాకుండా, తన గాత్రాన్ని కూడా అందించింది. ఈ పాట సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో డైరెక్టర్ రితేష్ రానా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.