https://oktelugu.com/

Vettiayan Movie : వేట్టయన్ మూవీ కి బజ్ క్రియేట్ అవ్వకపోవడానికి కారణం ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త కథలు వస్తున్న నేపథ్యంలో తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో కూడా కొత్త కథలతో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాలని చూస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 10, 2024 / 07:02 PM IST

    Vettiayan Movie

    Follow us on

    Vettiayan Movie :  తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్… ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈరోజు ఆయన ‘వేట్టయన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి అలరించడానికి సిద్ధమయ్యాడు. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంది అనే విషయం పక్కన పెడితే ఇక ఇంతకు ముందు రజినీకాంత్ నుంచి సినిమా వస్తుందంటే ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ హైప్ అయితే ఉండేది. కానీ సినిమా మీద ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ అయితే లేదు. మరి ఎందుకు ఆయన సినిమా మీద హైప్ క్రియేట్ అవ్వడం లేదనే విషయాల మీద కూడా చాలా ప్రశ్నలు అయితే తలెత్తున్నాయి. మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ సాధిస్తూ వచ్చిన క్రమంలో వేట్టయన్ సినిమాను ప్రేక్షకులు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు అంటే ముందుగా ఈ సినిమాని డైరెక్షన్ చేసింది జ్ఞానువెల్…ఈయన ఇంతకుముందు జై భీమ్ అనే సినిమా చేశారు. అయితే ఆయనకు కమర్షియల్ గా ఒక భారీ సినిమా చేసిన ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల మొదటి నుంచి కూడా ఈ సినిమా మీద సినిమా మీద అంత పెద్ద భారీ క్రేజ్ అయితే దక్కలేదు.

    ఇక లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో రజనీకాంత్ చేస్తున్న కూలీ సినిమాకి వచ్చినంత భారీ క్రేజ్ క్యూరియాసిటీ వేట్టయన్ సినిమా మీద రావడం లేదు. అందువల్లే ఈ సినిమాకి భారీ హైప్ రాకపోవడం కూడా ఒక కారణమని చెప్పొచ్చు. ఇక జైలర్ తర్వాత రజనీకాంత్ లాల్ సలామ్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకులను అల్లరించలేదు.ఇక ప్రస్తుతం దాని ఇంపాక్ట్ కూడా ఈ సినిమా మీద పడుతుంది.

    నిజానికి రజనీకాంత్ నుంచి సినిమా రావడం అనేది ఒకెత్తు అయితే ఆ సినిమా సక్సెస్ ఫుల్ గా నిలవడం అనేది మరొక ఎత్తు…ఇక ఈ క్రమంలోనే సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా తెలుగులో కూడా భారీ ఓపెనింగ్స్ సంపాదించుకునే సత్తా ఉన్న తమిళ స్టార్ హీరో కూడా రజినీకాంత్ కావడం విశేషం…

    ఇక వీటన్నింటి మధ్యలో కూడా రజనీకాంత్ ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ ను చేయలేకపోతున్నాడనేది చాలా క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. మరి మొదటి రోజు సినిమా ఎలాంటి టాక్ ను సంపాదించుకుంటుందో. ఇక దాన్ని బట్టే ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.