Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొద్దిరోజుల నుంచి ఏదో ఒక వివాదం ఐతే తెరమీదకి వస్తుంది. మొన్నటిదాకా మంచు ఫ్యామిలీ వివాదం జరగడమే కాకుండా నిన్న అల్లు అర్జున్ అరెస్టు విషయంలో కూడా చాలా హడావిడి అయితే చేశారు. మొత్తానికైతే అల్లు అర్జున్ కి బెయిల్ రావడం అనేది అందరిని సంతోషానికి గురి చేసిందనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అల్లు అర్జున్ హవా ఎక్కువగా నడుస్తుందనే చెప్పాలి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాశిస్తున్న ఈ హీరో మరోసారి పాన్ ఇండియాలో తనదైన రీతిలో సత్తా చాటుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన సందర్భంలో సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్ వెళ్ళడం తో అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఇక ఆ విషయంలో అల్లు అర్జున్ మీద కొన్ని కేసులు పెట్టారు. ఇక దానికి సంబంధించి నిన్న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్టు చేసి నాంపల్లి కోర్టు లో హాజరు పరిచారు. ఆ కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ ను విధించింది. ఇక అల్లు అర్జున్ 24 రోజుల పాటు రిమాండ్ లోనే ఉండాల్సిన పరిస్థితి అయితే ఎదురవుతుందని అందరు అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ లాయర్ అయిన నిరంజన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టు న్యాయమూర్తి దగ్గర భారీగా వాదించి మొత్తానికైతే అతనికి మద్యంతర బేయిల్ ఇప్పించాడు. ఇక యూట్యూబ్ లో ఆయన వాదించిన వాదన చూస్తే ప్రతి ఒక్కరు ఇంప్రెస్ అవ్వాల్సిందే. అలాంటి ఒక దమ్మున్న లాయర్ గా నిరంజన్ రెడ్డి తనను తాను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి హీరోకి బెయిల్ ఇప్పించి అతని అభిమానులతో పాటు యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులను సైతం అతను ఆకట్టుకున్నాడనే చెప్పాలి.
ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కి బెయిల్ ఇప్పించినందుకుగాను అల్లు అర్జున్ నిరంజన్ రెడ్డి కి భారీ పారితోషకం తో పాటు అతనికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీని కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఇంతకుముందు ఆచార్య సినిమాకి ప్రొడ్యూసర్ గా చేసిన నిరంజన్ రెడ్డి ఆ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూట గట్టుకున్నాడు.
దాంతో ఇప్పుడు అల్లు అర్జున్ ఒక మంచి కథ తీసుకొని దర్శకుని పట్టుకొని రా నీ బ్యానర్లో సినిమా చేస్తానని మాట ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక దాంతో నిరంజన్ రెడ్డి ఆనందానికి అవధులు లేనట్టుగా తెలూస్తోంది.
ఎందుకంటే ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్న సందర్భంలో ఇప్పుడు అతనితో సినిమాలు చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్లు విపరీతమైన డబ్బులను ఇస్తామని చెబుతూ వస్తున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తనకు భారీగా హెల్ప్ చేసిన నిరంజన్ రెడ్డి బ్యానర్ లోనే ఒక సినిమా చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మరి ఇది ఎప్పుడూ వర్క్ అవుట్ అవుతుందనే విషయం తెలియదు కానీ మొత్తానికైతే నిరంజన్ రెడ్డి జాక్ పాట్ కొట్టాడనే చెప్పాలి…