https://oktelugu.com/

Kangua Movie Collections : సూర్య ‘కంగువా’ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..తమిళనాడులో సగానికి పైగా థియేటర్స్ లో అవుట్!

మూడేళ్ళలో సూర్య కూడా ధనుష్, దుల్కర్ సల్మాన్ లాగ తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు చేసుంటే ఆయన రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేవాడు. కానీ కమర్షియల్ సినిమాలు చేసుకునే శివ లాంటి డైరెక్టర్ కంగువా లాంటి పీరియడ్ సబ్జెక్టు చేసే బాధ్యతలు అప్పగించడం ముమ్మాటికీ సూర్య చేసిన పొరపాటే.

Written By: Vicky, Updated On : November 17, 2024 2:10 pm
Kangua Movie Collections

Kangua Movie Collections

Follow us on

Kangua Movie Collections :  తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కంగువా’ ఇటీవలే భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందు దర్శక నిర్మాతలు ఏకంగా 2000 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టబోతున్నాం అని చెప్పడంతో అభిమానులు సినిమా ఆ రేంజ్ లో వచ్చిందా?, కచ్చితంగా సూర్య ఈ సినిమాతో కం బ్యాక్ అవుతాడు అని మురిసిపోయారు. కానీ విడుదల తర్వాత ఈ చిత్రం ‘ఇండియన్ 2’ కంటే ఘోరమైన డిజాస్టర్ అవుతుందని ఊహించలేకపోయారు. ఈ సినిమా కోసం సూర్య చాలా కష్టపడ్డాడు. పెర్ఫార్మన్స్ కూడా వేరే లెవెల్ లో ఉంది. తన పాత్రలోకి పూర్తిగా పరకాయ ప్రవేశం చేసి జీవించాడు. కానీ డైరెక్టర్ సహకరించలేదు. మూడేళ్ళ సూర్య విలువైన సమయాన్ని వృధా చేసాడు.

ఈ మూడేళ్ళలో సూర్య కూడా ధనుష్, దుల్కర్ సల్మాన్ లాగ తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు చేసుంటే ఆయన రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేవాడు. కానీ కమర్షియల్ సినిమాలు చేసుకునే శివ లాంటి డైరెక్టర్ కంగువా లాంటి పీరియడ్ సబ్జెక్టు చేసే బాధ్యతలు అప్పగించడం ముమ్మాటికీ సూర్య చేసిన పొరపాటే. ఇదంతా పక్కన పెడితే విడుదలై మూడు రోజులు పూర్తి చేసుకున్న ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. సూర్య కి మన తెలుగు రాష్ట్రాల్లో మొదటి నుండి మంచి క్రేజ్ ఉండడంతో, ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 25 కోట్ల రూపాయలకు జరిగింది. మూడు రోజులకు కలిపి 6 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 11 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 19 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాలి, అది అసాధ్యం.

అలాగే మిగిలిన ప్రాంతాల్లో వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే తమిళనాడు లో 21 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కర్ణాటక లో 3 కోట్ల 60 లక్షల రూపాయిలు, కేరళలో 5 కోట్ల 25 లక్షలు, ఓవర్సీస్ లో 19 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక హిందీ వెర్షన్ వసూళ్లు దాదాపుగా 10 కోట్ల రూపాయిల వరకు వచ్చింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 3 రోజులకు కలిపి 70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 33 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 180 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రావాలి. నేటి తో ఈ సినిమా రన్ దాదాపుగా పూర్తి అయ్యినట్టే, రేపటి నుండి షేర్ వసూళ్లు రావడం కష్టం కాబట్టి, బయ్యర్స్ కి వంద కోట్ల రూపాయలకు పైగానే నష్టం వాటిల్లబోతున్నట్టు సమాచారం.