Race Gurram re release: నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా , ఆయన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు ఏ రేంజ్ లో చేసుకుంటున్నారో మనం సోషల్ మీడియా లో అనేక వీడియోల ద్వారా చూస్తూనే ఉన్నాం. వాళ్ళ సంబరాలను , ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ కాసేపటి క్రితమే ‘రాకా’ మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. అల్లు అర్జున్ , అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. తన ప్రతీ సినిమా ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ ఏ రేంజ్ లో వైవిద్యం చూపించేవాడో , ఈ సినిమా ఫస్ట్ లుక్ లో కూడా అదే రేంజ్ వైవిద్యం చూపించాడు. ఇలాంటి టైటిల్ , ఇలాంటి లుక్ ని అసలు ఎవ్వరూ ముందుగా ఊహించలేకపోయారు.
ఇదంతా పక్కన పెడితే నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన కెరీర్ లో మైలు రాయిగా నిల్చిన ‘రేసు గుర్రం’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేశారు. దీనికి ఆడియన్స్ నుండి ముద్రమా స్పందన లభించింది. అయినప్పటికీ కూడా కొన్ని థియేటర్స్ లో అల్లు అర్జున్ అభిమానులు చేసిన సంబరాలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. ఒక థియేటర్ లో అభిమానులు గుర్రాలను తీసుకొచ్చి సందడి చేయడం హైలైట్ గా నిల్చింది. అందుకు సంబంధించిన వీడియోని మీరు క్రింద చూడొచ్చు. ఇలాంటి ఘటనలు గతం లో పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ప్రభాస్ వంటి సూపర్ స్టార్స్ చిత్రాల రీ రిలీజ్ అప్పుడు కూడా జరిగింది. ఇదంతా చూస్తుంటే జెన్ జీ కాలం లోని యూత్ ఆడియన్స్ ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇక ‘రేసు గుర్రం’ రీ రిలీజ్ కలెక్షన్స్ విషయానికి వస్తే, హైదరాబాద్ లోని కొన్ని టాప్ థియేటర్స్ , మరియు వైజాగ్ వంటి ప్రాంతాల్లో తప్ప, మిగిలిన అన్ని చోట్ల ఈ సినిమాకు డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది. వాస్తవానికి అల్లు అర్జున్ అభిమానులు ఈ రీ రిలీజ్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయినప్పటికీ ఇంత తక్కువ వసూళ్లు రావడానికి కారణం ఏంటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది విడుదల చేసిన ‘ఆర్య 2’ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ రన్ లో ఆ చిత్రానికి దాదాపుగా 7 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘రేసు గుర్రం’ చిత్రానికి మొదటి రోజు కోటి 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , క్లోజింగ్ లో 2 కోట్ల రూపాయిల లోపే గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
రేసు గుర్రం సినిమా రీ రిలీజ్ సందర్భంగా థియేటర్ లోకి గుర్రాలను తీసుకొచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ pic.twitter.com/yx5eDT7oOf
— Telugu Scribe (@TeluguScribe) April 8, 2026