Homeఎంటర్టైన్మెంట్LIK movie overseas rights issue: చివరి నిమిషంలో చేతులు మారిన 'LIK' మూవీ..పాపం నిర్మాతకు...

LIK movie overseas rights issue: చివరి నిమిషంలో చేతులు మారిన ‘LIK’ మూవీ..పాపం నిర్మాతకు భారీ నష్టాలు..

LIK movie overseas rights issue: వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) , ఈ నెల 10 వ తారీఖున ‘LIK’ అనే చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా పై ఆడియన్స్ లో ప్రదీప్ గత చిత్రాలకు ఉన్నంత క్రేజ్ లేదు. అందుకు కారణం , ఈ చిత్రం బాగా […]

LIK movie overseas rights issue: వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) , ఈ నెల 10 వ తారీఖున ‘LIK’ అనే చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా పై ఆడియన్స్ లో ప్రదీప్ గత చిత్రాలకు ఉన్నంత క్రేజ్ లేదు. అందుకు కారణం , ఈ చిత్రం బాగా ఆలస్యం అవ్వడం వల్లే. ప్రదీప్ రంగనాథన్ మొదటి చిత్రం ‘లవ్ టుడే’. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన కమిట్ అయిన చిత్రం ఇదే. కానీ గ్రాఫిక్స్ వర్క్ చాలా ఉండడం తో ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ గ్యాప్ లో ప్రదీప్ నుండి రెండు సినిమాలు విడుదల అయ్యాయి. ఇంత ఆలస్యం అయితే బజ్ క్రియేట్ అవ్వడం కష్టం.

పవన్ కళ్యాణ్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ సినిమాలే ఆలస్యం అవ్వడం వల్ల , మార్కెట్ లో బజ్ ఏర్పడని కాలం ఇది, ఇక ప్రదీప్ రంగనాథన్ లాంటి యంగ్ హీరోల సినిమాలకు బజ్ ఎలా క్రియేట్ అవుతుంది చెప్పండి. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టి రెండు రోజులైంది . కానీ ఇప్పటి వరకు బుక్ మై షో యాప్ లో ట్రెండింగ్ లోకి రాలేదు అంటేనే అర్థం చేసుకోవచ్చు , అడ్వాన్స్ బుకింగ్స్ ఎంత బలహీనంగా ఉన్నాయి అనేది. ప్రదీప్ గత చిత్రానికి మన టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోకి ఎలాంటి బుకింగ్స్ జరిగేవో, ఆ రేంజ్ బుకింగ్స్ జరిగాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ఎలా ఉన్నప్పటికీ, పాజిటివ్ మౌత్ టాక్ వస్తే మాత్రం పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా నార్త్ అమెరికా ఓవర్సీస్ రైట్స్ చివరి నిమిషం లో చేతులు మారడం హాట్ టాపిక్ గా మారింది.

ముందుగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని నార్త్ అమెరికా లో ప్రత్యంగిరా మూవీస్ సంస్థ కొనుగోలు చేసింది. చిన్న సినిమాల దగ్గర నుండి, పెద్ద సినిమాల వరకు నార్త్ అమెరికా లో ది బెస్ట్ రిలీజ్ దొరకాలంటే ఈ సంస్థ వల్లే సాధ్యం అవుతుంది. అలాంటి సంస్థ ఈ చిత్రం నుండి తప్పుకోవడం మేకర్స్ కి గట్టి ఎదురు దెబ్బ అనొచ్చు. మరి ఇప్పుడు ఈ రైట్స్ ఎవరి చేతుల్లోకి వెళ్ళింది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నార్త్ అమెరికా లో మొదలు అవ్వలేదు. మరోపక్క ఈ చిత్రం తో పాటు విడుదల అవుతున్న ‘డెకాయిట్’ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై భారీ గ్రాస్ కూడా నమోదు అయ్యింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper