Allu Arjun: పవన్ కళ్యాణ్ మీద ఫైర్ అవుతున్న అల్లు అర్జున్ అభిమానులు… కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అందులో పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన సినిమాల్లోనే కాకుండా రాజకీయపరంగా కూడా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన రాజకీయ నేతగా ఎదిగాడు...

Written By: Gopi, Updated On : August 9, 2024 1:41 pm

Allu Arjun

Follow us on

Allu Arjun: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. అలాగే పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే…ఇక ముఖ్యంగా ఆయన పర్యావరణ పరిరక్షణ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాంటి అవసరాలైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా పవన్ కళ్యాణ్ ముందు అడుగు వేస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన ప్రజల కష్టాలను తీరుస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పడినందుకు ప్రజలు సంతోషంగా ఉండాలనే ఒకే ఒక కాన్సెప్ట్ తో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాలు, అక్రమాలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే పర్యావరణ పరిరక్షణ శాఖ మంత్రిగా ఆయన మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేసేవాళ్లు హీరోలు పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా సినిమాలు చేయండి. చెట్లను కొట్టివేయడం లాంటి సీన్లు సినిమాల్లో లేకుండా ఉంటే మంచిది అని ఆయన కొన్ని వ్యాఖ్యలైతే చేశాడు. ఇక దాంతో అల్లు అర్జున్ ను ఉద్దేశించే పవన్ కళ్యాణ్ ఇలాంటి కామెంట్స్ చేశారంటూ కొంతమంది కొన్ని వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు.

నిజానికి పవన్ కళ్యాణ్ కి ఎవరి మీద కామెంట్స్ చేయాల్సిన అవసరమైతే లేదు. ఎందుకంటే ఆయన ఎవర్ని టార్గెట్ చేసి మాట్లాడాడు. తనకి ఏదైతే న్యాయమనిపిస్తుందో అదే మాట్లాడుతూ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం చెట్ల ను కొట్టి స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఈ కామెంట్లు చేశాడు అంటూ అల్లు అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అల్లు అర్జున్ పుష్ప సినిమాలో స్మగ్లర్ పాత్రను పోషించాడు. ఆ పాత్ర చేయడంలో తప్పులేదు.

కానీ ఆ దర్శకుడు స్మగ్లర్నే హీరోగా చూపించడం అనేది చాలా తప్పని మరికొంతమంది భావిస్తున్నారు. ఒకప్పుడు స్మగ్లర్లను పట్టుకోడానికి హీరోలు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు హీరోలే స్మగ్లర్లుగా చేస్తున్నారు. ఇక ఇది చూసే జనాలు వాళ్లను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇల్లీగల్ కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు కూడా ఉంటాయి కదా అనే కోణంలో మరి కొంతమంది మాట్లాడుతున్నారు… నిజానికి పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. ఒక బాధ్యత గల హీరో సమాజానికి మంచి చేయకపోయిన పర్లేదు కానీ వాళ్ళ సినిమాల వల్ల జనాలకు చెడు అనేది చేయడం చాలా వరకు తప్పు…

ఇక పవన్ కళ్యాణ్ తను సినిమాలో సిగరెట్ తాగితే తన అభిమానులు కూడా సిగరెట్లు తాగుతున్నారనే ఉద్దేశ్యంతో ఆయన సినిమాల్లో సిగరెట్లు తాగడమే మానేశాడు. అలా ఒక సామాజిక స్పృహతో హీరోలు ఉండాలని పవన్ కళ్యాణ్ చెప్తుంటాడు. అంతే తప్ప ఎవరినో బ్యాడ్ చేయాలనే ఉద్దేశ్యం అయితే ఆయనకి లేదు అనేది మాత్రం వాస్తవం… ఇక ఈ విషయాన్ని అల్లు అర్జున్ అభిమానులు కూడా తెలుసుకుంటే మంచిదని మరి కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెబుతున్నారు…