Homeఎంటర్టైన్మెంట్Allu Arjun: మరో వివాదంలో అల్లు అర్జున్, సోషల్ మీడియాలో విమర్శలు, కారణం ఇదే!

Allu Arjun: మరో వివాదంలో అల్లు అర్జున్, సోషల్ మీడియాలో విమర్శలు, కారణం ఇదే!

Allu Arjun: అల్లు అర్జున్ పుష్ప 2 భారీ హిట్. బాహుబలి 2 రికార్డులను సైతం బ్రేక్ చేసిన చిత్రం అది. నార్త్ ఇండియాలో ఎవరికీ లేనంత ఫేమ్ అల్లు అర్జున్ కి ఉందని పుష్ప 2 తో రుజువైంది. పుష్ప 2 హిందీ వెర్షన్ రూ. 800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం అందుకు నిదర్శనం. లోకల్ సూపర్ స్టార్స్ కి కూడా దక్కని అరుదైన రికార్డు పుష్ప 2 చిత్రంతో అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. పుష్ప 2 విజయాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయాడు అల్లు అర్జున్. అందుకు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కారణమైంది.

Also Read: వరుసగా 7 డిజాస్టర్ ఫ్లాప్స్..పాపం పూజా హెగ్డే పరిస్థితి ఇలా అయిపోయిందేంటి!

అనుమతులు లేకుండా సంధ్య థియేటర్ ని అల్లు అర్జున్ సందర్శించాడు. అందుకే తొక్కిసలాట చోటు చేసుకుంది. మహిళ మృతి చెందింది అంటూ ఆయన మీద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ఒకరోజు రాత్రి జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అల్లు అర్జున్ అరెస్ట్ రాజకీయ దుమారం రేపింది. సీఎం రేవంత్ రెడ్డి ఇండస్ట్రీ మీద ఫైర్ అయ్యారు. అలాగే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలపడం సైతం వివాదాలను రాజేసిన సంగతి తెలిసిందే.

తాజాగా అల్లు అర్జున్ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. సెల్ఫీ అడిగిన అభిమాని కోరికను ఆయన తిరస్కరించాడు. ముంబై వేదికగా ఇటీవల వేవ్స్ సదస్సు జరిగింది. టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అల్లు అర్జున్ సైతం పాల్గొనడం జరిగింది. ముంబై ఎయిర్ పోర్ట్ లో అల్లు అర్జున్ కనిపించడంతో ఓ అభిమాని సెల్ఫీ కోసం దగ్గరకు వెళ్ళాడు. అందుకు అల్లు అర్జున్ నిరాకరించారు. దాంతో ఆయన సిబ్బంది సదరు అభిమానిని అడ్డుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అభిమానులు లేకపోతే మీరు లేరు.. అని ఒకరు కామెంట్ చేయగా, ఒక అభిమానిని జీవితాంతం అల్లు అర్జున్ కోల్పోయాడు.. అంటూ మరొకరు కామెంట్ చేశారు. అభిమానికి సెల్ఫీ ఇవ్వకపోవడం పై నెటిజెన్స్ అల్లు అర్జున్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీతో మూవీ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక ఉపయోగించి హాలీవుడ్ రేంజ్ లో మూవీ తెరకెక్కిస్తున్నారని సమాచారం.

Exit mobile version