Allu Arjun trust in Atlee : స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ కెరీర్ మొదటి నుంచి మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్న ఆయన బాలీవుడ్లో ప్రేక్షకులందరికి అభిమాన హీరోగా మారిపోయాడు. పుష్ప 2 (Pushpa 2) సినిమాతో పాన్ ఇండియాలో ఉన్న రికార్డులన్నింటిని తిరగరాస్తు భారీ విజయాలను అందుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది…ప్రస్తుతం అట్లీ (Atlee) డైరెక్షన్లో సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమాతో మరో మెట్టు పైకి ఎక్కే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పాన్ వరల్డ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం 800 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
మరి ఈ సినిమా పాన్ వరల్డ్ లో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించి వరల్డ్ సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ని స్టార్ హీరోగా మారుస్తుందా? తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి క్రియేట్ చేసుకోబోతున్నాడా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇప్పటివరకు ఆయన డైరెక్షన్ లో వచ్చిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించింది.
Also Read : అల్లు అర్జున్, అట్లీ మూవీ గురించి సంచలన అప్డేట్..ఫ్యాన్స్ కి పండగే!
కాబట్టి అందుకే ఆయనతో సినిమా చేయడానికి అల్లు అర్జున్ ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా తొందర్లోనే సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.
ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు అల్లు అర్జున్ చేసిన సినిమాలు ఓకే అయితే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. మరి అల్లు అర్జున్ ఈ సినిమాతో కూడా ఇండస్ట్రీ హిట్ ను సాధించినట్టయితే ఆయన నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే మాత్రం తన మార్కెట్ ను కోల్పోయి మరింత డీలా పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి…