Arjun Reddy Movie budget : సందీప్ రెడ్డి వంగ (Sundeep Reddy Vanga) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Devara konda) హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం మొదట అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువైందని సందీప్ రెడ్డివంగ పలు ఇంటర్వ్యూలో తెలియజేశారు. మొదట మూడు కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించాలనే ప్రయత్నం చేసినప్పటికి అది ఇంట్రెస్ట్ తో కలిపి నాలుగున్నర కోట్ల వరకు అయిందని సినిమా ఆడితేనే ఆ డబ్బులు తిరిగి వస్తాయి. లేకపోతే మాత్రం భారీగా నష్టపోతాం అంటూ సందీప్ సన్నిహితులు సైతం అతనికి చెప్పినప్పటికి ఆయన మాత్రం సినిమా మీద భారీ కాన్ఫిడెంట్ ను పెట్టుకున్నాడట. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు తీయానటువంటి కొత్త రకం సినిమాని నేను చేశానని ఈ సినిమాతో నాకు మంచి గుర్తింపు వస్తుందని ఆయన మొదటి నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉండడంతో ఈ సినిమా ఆయన అనుకున్నట్టుగానే భారీ విజయాన్ని సాధించింది. తెలుగులో ఈ సినిమా దాదాపు 50 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది. 5 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 50 కోట్ల ప్రాఫిట్ రాబట్టింది అంటే పెట్టిన బడ్జెట్ కంటే దాదాపు పదిరెట్లు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయనే చెప్పాలి…
నిజానికి అర్జున్ రెడ్డి సినిమా స్టోరీని దాదాపు 5 సంవత్సరాల పాటు పట్టుకొని చాలా మంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి తిరిగారట. అప్పుడు ఎవ్వరు కూడా ఆ కథకి సరైన రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో తనే ప్రొడ్యూసర్ గా మారి ఓన్ బ్యానర్ లోనే ఈ సినిమాను చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రభాస్ (Prabhas) తో స్పిరిట్ (Spirit) అనే సినిమా చేస్తున్నాడు.
Also Read : సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ కాంబో లో రావాల్సిన సినిమా ఉంటుందా..?
ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్లాయనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఇక మీదట రాబోయే సినిమాలతో కూడా ఆయన తను ఏంటో నిరూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…మరి తను అనుకున్నట్టుగానే భారీ విజయాన్ని సాధించి ముందు ముందు కూడా స్టార్ హీరోగా తనను తాను వెలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక సందీప్ రెడ్డి వంగ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలామంది దర్శకులు గా మారాలని ఇండస్ట్రీకి వస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరు వాళ్ల కెరియర్ లో డేరింగ్ స్టెప్ వేస్తూ ముందుకు సాగినప్పుడు మాత్రమే వాళ్లు సక్సెస్ లను సాధిస్తారు అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండటం విశేషం…