Pushpa 3 : అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2(Pushpa 2) సినిమా భారీ రికార్డులను కొల్లగొట్టడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టింది. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమాకు సంబంధించిన థాంక్స్ మీట్ ను రీసెంట్ గా నిర్వహించారు. ఇక అందులో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈ సినిమా విషయంలో సుకుమార్ చాలా వరకు కష్టపడ్డాడని తెలియజేశాడు. ఇక దాంతో పాటుగా పుష్ప 3 (Pushpa 3) సినిమా కూడా ఉంటుంది కానీ ఆ కథ నీకు తెలియదు నాకు తెలియదు అంటూ సుకుమార్ ను ఉద్దేశించి చెప్పడంతో కొంతమంది అల్లు అర్జున్ అభిమానులు తీవ్రమైన కోపానికి గురవుతున్నారు. ఎందుకు అంటే పుష్ప 2 సినిమా స్టోరీ రాసుకున్నప్పుడే పుష్ప 3 సినిమా స్టోరీ రాసుకున్నామంటూ సుకుమార్ గతంలో తెలియజేశాడు. కానీ అదంతా ఫేక్ అని ఇప్పుడు తెలుస్తోంది. మరి అదంతా ఫేక్ అయినప్పుడు సినిమా చివర్లో పుష్ప రాజ్ తన ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఎవరో వచ్చి బాంబు ను ఎలా పెట్టారు. బాంబును పేల్చిన వాడెవడు ఎందుకు ఇలాంటి ఫేక్ బ్యాగ్స్ ని ఇస్తున్నారు అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
ఇక దానికి సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ముందుగా కథ మొత్తాన్ని రాసుకున్న తర్వాత క్లైమాక్స్ అయితే రివీల్ చేయాల్సి ఉంటుంది. కానీ తను మాత్రం కథ రాసుకోకుండానే ఏదో ఒక క్లైమాక్స్ ఇచ్చి ఆ తర్వాత కథ రాసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
అలా చేయడం చాలా వరకు తప్పు ఇప్పుడు బాహుబలి సినిమాలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే పాయింట్ ను రాజమౌళి ముందుగానే రాసుకొని బాహుబలి మొదటి పార్ట్ లో దానికి సరిపడా క్లారిటీ అయితే ఇచ్చాడు…మరి ఇలాంటి సందర్భంలో సుకుమార్ మాత్రం పుష్ప 3 కథ లేకుండానే ఆ సినిమా ఉంటుందని అనౌన్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మిగతా సినిమా ప్రేక్షకులందరు వాళ్ల మీద కొంతవరకు కోపాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియా మొత్తం ఇదే న్యూస్ వైరల్ అవుతుండటం విశేషం… మరి ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్న పుష్ప 3 సినిమా పుష్ప 2 ను మించి ఉంటుందా లేదా అనేది ఇప్పుడప్పుడే తెలిసెలా లేదు. ఎందుకంటే సుకుమార్ కథ రాసుకున్న తర్వాత ఈ పుష్ప 2 మించి పుష్ప 3 ఉంటుందా లేదా అనేది తెలుస్తోంది…