Allu Arjun And Atlee: ‘పుష్ప 2’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) అట్లీ(Atlee) తో మొదలు పెట్టిన సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కమర్షియల్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన అట్లీ నుండి ఆడియన్స్ కమర్షియల్ సినిమాలనే ఆశిస్తారు. కానీ మొట్టమొదటిసారి ఆయన తన రూటు ని మార్చి సైన్స్ ఫిక్షన్ జానర్ లో సినిమా చేస్తున్నాడు. రెండు గ్రహాలకు సంబంధించిన ఫిక్షనల్ స్టోరీ తో ఆయన అల్లు అర్జున్ తో సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు. ఇందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తుండగా, దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. ఈమెకు సంబంధించిన వీడియో ని కూడా మేకర్స్ ఈ ఏడాది విడుదల చేశారు. దీపికా పడుకొనే తో పాటు ఈ చిత్రం మరో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో ఒకరు మృణాల్ ఠాకూర్.
తెలుగు, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్న మృణాల్ ఠాకూర్ ఇప్పటికే షూటింగ్ లో పాల్గొని, అల్లు అర్జున్ కాంబినేషన్ లో చాలా సన్నివేశాల్లో నటించింది అట. ఇక ఈ చిత్రం నటిస్తున్న మూడవ హీరోయిన్ జాన్వీ కపూర్. బాలీవుడ్ లో వరుసగా ఫ్లాప్ సినిమాలు చేస్తూ వస్తున్న ఈమె, మన టాలీవుడ్ లోకి ‘దేవర’ చిత్రం ద్వారా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వడం తో ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి ‘పెద్ది’ చిత్రం చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లోనే ఆమెకు అల్లు అర్జున్, అట్లీ మూవీ లో నటించే అవకాశం వచ్చింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా గ్రాండ్ గా చేయనున్నారు. ఇక అల్లు అర్జున్ తో పుష్ప సిరీస్ లో హీరోయిన్ గా నటించి, పాన్ ఇండియా లెవెల్ లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక కూడా ఇందులో నటించబోతోంది అట.
ఇందులో ఆమె విలన్ క్యారక్టర్ చేస్తున్నట్టు సమాచారం. ఇక 5వ గా అట్లీ ఎవరిని తీసుకోబోతున్నాడు అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముందుగా టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ భాగ్య శ్రీ భొర్సే ని తీసుకుంటారేమో అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిలుస్తున్న వార్త ఏమిటంటే, ఒక కొత్త హీరోయిన్ ని ఈ క్యారక్టర్ కోసం తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట. దీనికి సంబంధించిన ఆడిషన్స్ కూడా మొదలు పెట్టారట. ప్రెస్టీజియస్ అల్లు అర్జున్ పాన్ వరల్డ్ చిత్రం లో ఛాన్స్ దక్కించుకోబోతున్న ఆ లక్కీ యంగ్ బ్యూటీ ఎవరో చూడాలి.