Allu Arjun Atlee Movie: ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియాలో గొప్ప విజయాలనుందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి చేసిన బాహుబలి సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే. ఆ సినిమాతో రాజమౌళి గొప్ప ఐడెంటిటిని సంపాదించుకొన్నాడు. ఇక తన బాటలోనే మరి కొంతమంది దర్శకులు కూడా నడుస్తూ ఉండడం విశేషం…ఇక సౌత్ లో ఉన్న ఇతర భాషల దర్శకులు సైతం పాన్ ఇండియా బాట పడుతున్నప్పటికి వాళ్లెవరికి సరైన సక్సెసులు వరించడం లేదు. హాలీవుడ్ హీరో అయిన షారుక్ ఖాన్ తో జవాన్ అనే సినిమా తీసి మంచి విజయాన్ని సాధించాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ తో సినిమా చేస్తుండటం విశేషం…గతేడాది ‘పుష్ప 2’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అలాంటి అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ తో చేస్తున్న సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుపుతూ ఉండడం విశేషం…ఈ మూవీ షూటింగ్ లో భాగంగా ఈ సినిమా కోసం ముంబై లో భారీ సెట్లను వేస్తున్నారు. ఇప్పటికే ముంబాయి నగర శివారులలో కొన్ని కోట్ల డబ్బులు వెచ్చించి భారీ సెట్లు వేశారు. దాంతో అక్కడే ప్రశాంతంగా షూటింగ్ జరుపుకుంటున్నారు.
Also Read: స్టార్ క్రికెటర్ తో డేటింగ్ పై మొదటిసారి స్పందించిన మృణాల్ ఠాకూర్!
మరి వాళ్ళు హైదరాబాద్ ఎందుకు రావడం లేదు ఇక్కడ ఎందుకు షూట్ జరుపుకోవడం లేదంటూ చాలా మంది వాళ్ళ మీద కామెంట్లయితే చేస్తున్నారు. ఇప్పటివరకు 30% షూట్ ని కంప్లీట్ చేశారు అయినప్పటికీ ఒక్క లీకేజీ కూడా రాలేదు. దాంతో అక్కడే సురక్షితంగా ఉందనే ఉద్దేశ్యంతో అక్కడే సెట్ వేసి మరి సినిమా చేస్తుండటం విశేషం…
ఇక దర్శకుడు తమిళ్ ఇండస్ట్రీకి అతను, హీరో టాలీవుడ్ కి చెందిన వాళ్ళు కావడంతో అక్కడ వీళ్లను పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక అట్లీ ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్ లతో పని చేయించుకుంటున్నారు. ఇక ఇంకెవరైనా టెక్నీషియన్స్ కావాల్సి ఉంటే ముంబై వాళ్ళనే తీసుకుంటున్నారు. ఇక ఇదంతా చూసిన చాలా మంది తెలుగు ప్రేక్షకులు సైతం తెలుగు వాళ్ళని ఈ సినిమా కోసం ఎందుకు తీసుకోవడం లేదు.
అలాగే మన హైదరాబాదులో సెట్లు వేసుకొని సినిమాలు చేస్తే మనవాళ్ళకే డబ్బులు వస్తాయి కదా! అక్కడెక్కడ ముంబైలో సెట్స్ వేసుకొని వాళ్లకు ఎందుకు మనం డబ్బులు చెల్లించాలి అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. మరి వీటన్నింటికి చెక్ పెడుతూ తొందర్లోనే హైదరాబాద్ షూటింగ్ జరుపుతారా? లేదంటే మొత్తం షూట్ ముంబైలోనే చేస్తారా అనేది తెలియాల్సి ఉంది…