Allu Arjun Atlee Movie Update: తెలుగు సినిమా ఇండస్ట్రీలు అల్లు అర్జున్ (Allu Arjun) కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇంతకుముందు ఆయన చేసిన ‘ పుష్ప’ (Pushpa) సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన ‘పుష్ప 2’ సినిమాతో పాన్ ఇండియాలో ఉన్న రికార్డులను సైతం కొల్లగొట్టాడు. రాజమౌళి – ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బాహుబలి 2(Bahubali 2) సినిమా 1800 కోట్లకు పైన కలెక్షన్స్ ను వసూలు చేసింది. ఈ సినిమా 1950 కోట్లు వసూలు చేసి ఆ రికార్డును తిరగరాసిందనే చెప్పాలి. ప్రస్తుతం ఇండియాలో భారీ సక్సెస్ ను సాధించిన సినిమాల్లో పుష్ప 2 సినిమా కూడా ఒకటి కావడం విశేషం…అయితే అల్లు అర్జున్ మాత్రం ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. త్రివిక్రమ్ తో సినిమాని అనౌన్స్ చేసినప్పటికి ఆయనకు పాన్ ఇండియా మార్కెట్ లేదనే ఒకే ఒక ఉద్దేశ్యంతో అతన్ని పక్కన పెట్టి పాన్ ఇండియాలో వరుస సక్సెస్ ను సాధిస్తున్న అట్లీ (Atlee) డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ‘దీపిక పదుకొనే’ (Deepika Padukone) హీరోయిన్ గా నటించబోతుందనే విషయానైతే చాలా స్పష్టంగా తెలియజేశారు.
మరొక బాలీవుడ్ స్టార్ హీరో కూడా ఇందులో భాగమవ్వబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్లో టాలెంటెడ్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అక్షయ్ కుమార్ (Akahay kumar) gatha కొద్దిరోజుల నుంచి చాలా సిరియన్ సక్సెస్ లేక డీలా పడిపోయారు.
Also Read: Allu Arjun – Atlee : అల్లు అర్జున్, అట్లీ మూవీ కి టైటిల్ ఖరారు..ఫ్యాన్స్ కి పూనకాలే!
దాంతో ఒక్క సక్సెస్ ని సాధించడానికి కూడా ఆయన నానా తంటాలు పడుతున్న క్రమంలో అతన్ని ఈ సినిమా కోసం అట్లీ సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది క్లారిటీగా తెలియదు. కానీ మొత్తానికైతే ఈ సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేయడమే కాకుండా భారీ సక్సెస్ ను అందుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
అట్లీ అతను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించి భారీ రికార్డులను క్రియేట్ చేస్తాడా? అల్లు అర్జున్ కి మర్చిపోలేని ఒక సక్సెస్ ఫుల్ సినిమాని అందిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…