Allu Arjun – Atlee : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ‘పుష్ప 2’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత తమిళ డైరెక్టర్ అట్లీ తో సైన్స్ ఫిక్షన్ జానర్ లో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా ఒక గ్రాండ్ వీడియో తో అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు తెలిపారు. త్వరలోనే షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకోబోతున్న ఈ సినిమా గురించి రోజుకు ఒక అప్డేట్ సోషల్ మీడియా లో లీక్ అవుతూ బాగా వైరల్ అవుతున్నాయి. ఇందులో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ లో నటించబోతున్నాడనే వార్త చాలా రోజుల నుండి ప్రచారం లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అదే విధంగా ఈ చిత్రం లో హీరోయిన్స్ గా దీపికా పదుకొనే(Deepika Padukone), జాన్వీ కపూర్(Jhanvi kapoor), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) కూడా ఖరారు అయ్యారని, వీళ్ళతో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఇందులో భాగం కాబోతున్నారు అంటూ వార్తలు ప్రచారం అయ్యాయి.
అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్టు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం. అల్లు అర్జున్ ట్యాగ్ స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఐకాన్’ అనే పేరు ని పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గతం లో వేణు శ్రీరామ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఐకాన్ అనే చిత్రాన్ని ప్రకటించారు. కానీ ఎందుకో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఇప్పుడు ఆ టైటిల్ తోనే అల్లు అర్జున్ తన కెరీర్ లో ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్న పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రానికి కేవలం ఐకాన్ అనే టైటిల్ ని మాత్రమే కాదు, ‘సూపర్ హీరో’ అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ రెండు టైటిల్స్ లో ఎదో ఒకటి కచ్చితంగా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read : అల్లు అర్జున్, అట్లీ మూవీ గురించి సంచలన అప్డేట్..ఫ్యాన్స్ కి పండగే!
ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ సినిమా కోసం తన శరీరం మొత్తాన్ని పూర్తి గా మార్చుకునే పనిలో పడ్డాడు. సుమారుగా అల్లు అర్జున్ 5 ఏళ్ళ పాటు పుష్ప సిరీస్ కి తన కెరీర్ ని అంకితం చేసాడు. ఈ సినిమాకు పెద్దగా ఆయన సిక్స్ ప్యాక్ బాడీ చేయాల్సిన అవసరం రాలేదు. అదే విధంగా లుక్స్ కూడా ఒకేలా ఉంటాయి. కానీ అట్లీ సినిమా కోసం మాత్రం ఆయన మళ్ళీ సిక్స్ ప్యాక్ బాడీ ని పెంచే పనిలో పడ్డాడు. ఒక ప్రముఖ జిమ్ ట్రైనర్ ని తన ఇంటికి కూడా పిలిపించుకున్నాడు. ప్రతీ రోజు ఆయన వర్కౌట్స్ కోసం రెండు నుండి మూడు గంటల సమయం కేటాయిస్తున్నాడట. దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు, అల్లు అర్జున్ ఈ చిత్రం కోసం ఎంతలా ప్రాణం పెట్టి పనిచేయబోతున్నాడు అనేది.