Allu Arjun and Atlee : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ (Allu Arjun) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయన క్రియేట్ చేసిన ప్రభంజనం అంతా ఇంత కాదు. తద్వారా ఆయన లాంటి నటుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలోనూ ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. తద్వారా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని పెట్టుకుంటారా? లేదా అనే విషయాల పట్ల సరైన క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ (Atlee) సినిమాతో పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. అయితే రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ను ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ సినిమా 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతుందంటూ కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. అలాగే అట్లీ ఈ సినిమాని భారీ గ్రాఫికల్ వండర్ గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారట.
Also Read : అల్లు అర్జున్, అట్లీ సినిమాలో హీరోయిన్ ఆమేనా..? ఫ్యాన్స్ ఏమైపోతారో!
ఇక అల్లు అర్జున్ లాంటి నటుడు తన ఎంటైర్ కెరీర్ లో చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నప్పటికి ఇప్పుడు పాన్ వరల్డ్ లో చేయబోతున్న ఈ సినిమాతో గొప్ప గుర్తింపును సంపాదించుకొని ఆయనకంటూ ఉన్న ఒక మార్కెట్ ని ఏర్పాటు చేసుకొని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దానికోసమే తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారట.
ఇక ఇందులో ఆయన క్యారెక్టరైజేషన్ కూడా చాలా కొత్తగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక డిఫరెంట్ గా తనని తాను ప్రజెంట్ చేసుకొని హాలీవుడ్ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించాలని తన నుంచి వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకుడికి విపరీతంగా నచ్చాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నాడు. ఇక అట్లీ సైతం ఈ సినిమా కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా భారీ కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసుకొని మరి ఈ సినిమాని అద్భుతమైన మేకింగ్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడు.
మరి ఏది ముఖ్యమైన కూడా ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్లేస్ ని ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ లాంటి హీరోలు అందరూ పాన్ వరల్డ్ ఇండస్ట్రీ మీద ఫోకస్ చేస్తున్న సందర్భంలో అల్లు అర్జున్ సైతం ఇప్పుడు అదే బాటలో నడుస్తుండటం విశేషం.
Also Read : అల్లు అర్జున్ అట్లీ మూవీ ఓపెనింగ్ డేట్ వచ్చేసిందిగా..?