MLC Ram Gopal Reddy : పులివెందులలో( pulivendula) జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ తగ్గింది. దీంతో అక్కడ తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని అంతా భావించారు. కానీ ఆ పార్టీకి విభేదాలు తప్పడం లేదు. ప్రస్తుతం అక్కడ ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. టిడిపి ఇన్చార్జి బీటెక్ రవి వర్సెస్ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అన్నట్టు పరిస్థితి మారింది. ప్రతిసారి ఆ ఇద్దరు నేతల మధ్య విభేదాలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పై బీటెక్ రవి అనుచరులు దాడి చేసినంత పని చేశారు. దీంతో మరోసారి రచ్చకు ఎక్కింది పులివెందుల టిడిపి వ్యవహారం. చివరకు పోలీసులు వెళ్లి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కాపాడాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది.
Also Read : ఛార్లెట్‌లో ఎన్నారైల ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు
* సతీష్ రెడ్డి రాజీనామాతో..
దశాబ్దాలుగా పులివెందులలో టిడిపికి సతీష్ రెడ్డి( Satish Reddy ) ఇన్చార్జిగా ఉండేవారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పై ఆయనే పోటీ చేశారు. జగన్మోహన్ రెడ్డి పై కూడా ఆయనే బరిలో దిగారు. వైయస్ కుటుంబం పై ఐదు సార్లు పోటీ చేశారు సతీష్ రెడ్డి. 2014లో చంద్రబాబు పిలిచి సతీష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే పులివెందులలో పట్టు బిగించారు బీటెక్ రవి. చాలా దూకుడుగా వ్యవహరిస్తుండడంతో చంద్రబాబు ఆయనను ప్రోత్సహించడం ప్రారంభించారు. 2024 ఎన్నికల్లో బీటెక్ రవికి సీటు ఇస్తానని చెప్పారు చంద్రబాబు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సతీష్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అప్పటినుంచి బీటెక్ రవి హవా నడుస్తోంది. కానీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి రూపంలో బీటెక్ రవికి ప్రత్యామ్నాయ నాయకత్వం ఎదురవుతోంది.
* తరచూ పంచాయితీ
అయితే ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలతో తరచూ పులివెందులలో పంచాయితీ నడుస్తోంది. తాజాగా పులివెందుల నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరయ్యారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి( MLC Ram Gopal Reddy). ఇంచార్జ్ మంత్రి సవిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి వచ్చిన రామ్ గోపాల్ రెడ్డి పై దాడికి ప్రయత్నించారు బీటెక్ రవి వర్గీయులు. సమావేశం లో వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు పోలీసులు వచ్చి రాంగోపాల్ రెడ్డికి రక్షణగా నిలిచారు. అయితే ఇలా గొడవలు జరగడం ఇది తొలిసారి కాదు. గతంలో రామ్ గోపాల్ రెడ్డి అనుచరులపై నేరుగా బీటెక్ రవి దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి.
* జగన్మోహన్ రెడ్డికి లాభం..
అయితే పులివెందులలో ఈసారి జగన్మోహన్ రెడ్డికి ( Jagan Mohan Reddy) మెజారిటీ తగ్గింది. అయితే టిడిపిలో ఉన్న విభేదాలు చూస్తుంటే మాత్రం ఒక వర్గం ఉంటే మరో వర్గం సహకరించే పరిస్థితిలో లేదు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పట్టు బిగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితుల్లో అనుకూలించడం లేదు. తెలుగుదేశం పార్టీలో ఐక్యత కనిపించడం లేదు. పైగా మొన్నటి ఎన్నికల్లో షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీ కాస్త ఇబ్బంది పెట్టింది. అయినా సరే మంచి మెజారిటీతోనే గెలిచారు జగన్మోహన్ రెడ్డి. టిడిపి విభేదాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరంగా మారుతున్నాయి. మరి దీనిపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
పులివెందుల టీడీపీలో లోల్లి.. ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డిపై దాడికి యత్నం
మంత్రి సవిత చెబుతున్న రాంగోపాల్‌రెడ్డిపై దాడి చేయబోయిన వ్యతిరేక వర్గం
ట్రిపుల్ ఐటీలో ఉద్యోగాలు, క్యాంటీన్లను వైసీపీ శ్రేణులకు అమ్ముకోవడమే కాకుండా.. మైనింగ్ విషయంలో తమపై తప్పుడు ఫిర్యాదులు… pic.twitter.com/XGJVHVobi0
— greatandhra (@greatandhranews) April 8, 2025