Allu Arjun: మహేష్ బాబు ఎప్పుడూ భార్యాపిల్లలతో ఫారెన్ టూర్లు వేస్తుంటాడు. ఇక ఈ మధ్యన ఎన్టీఆర్ కూడా యూరప్ ట్రిప్ వేశాడు. కానీ మన బన్నీ తన ఇంట్లోనే పిల్లాపాపలతో గడుపుతాడు. కానీ తొలిసారి ఓ మంచి కార్యక్రమం కోసం అమెరికాకు వచ్చాడు. భారత 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబురాలు అమెరికాలో జరిపేందుకు పరేడ్ లో పాల్గొనేందుకు తరలివచ్చాడు. అల్లు అర్జున్ -ఆయన భార్య స్నేహ ఇండియా డే పరేడ్‌లో పాల్గొనడానికి అమెరికాలోని న్యూయార్క్ చేరుకున్నారు. ఈ మేరకు వారిద్దరూ అమెరికా ఎయిర్ పోర్టులో దిగిన ఫోటోలు, వీడియో వైరల్ అయ్యాయి.

అల్లు అర్జున్ -అతని భార్య స్నేహ రెడ్డి ఆగస్టు 19న న్యూయార్క్ విమానాశ్రయంలో దర్శనమిచ్చారు. న్యూయార్క్‌లో జరిగే వార్షిక భారత స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌కు నాయకత్వం వహిస్తారు. బన్నీ న్యూయార్క్ లో దిగిన ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్‌కు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ 75 సంవత్సరాల భారత స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి బన్నీని సతీసమేతంగా ఆహ్వానించినట్టు తెలిసింది. అందుకోసమే న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్ కు రాగా పలువురు అభిమానులు గుర్తుపట్టి బన్నీకి విషెస్ తెలిపారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప: ది రూల్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ మరో రెండు నెలల్లో ప్రారంభం కానుందని సమాచారం. ఆగస్ట్ 19న అల్లు అర్జున్ -అతని భార్య స్నేహ న్యూయార్క్ విమానాశ్రయం నుండి బయటకు వస్తున్నారు. నగరంలో జరిగే వార్షిక భారత దినోత్సవ పరేడ్‌లో వారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అల్లు అర్జున్ యే దీన్ని లీడ్ చేస్తారని అంటున్నారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ న్యూయార్క్, న్యూజెర్సీ మరియు కనెక్టికట్ భారతదేశ 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకోవడానికి అనేక కార్యక్రమాలను నిర్వహించాయి. తాజా కార్యక్రమానికి బన్నీని ఆహ్వానించాయి. అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ లో న్యూయార్క్ నగరంలో దిగానని అక్కడి ఫొటోలను పంచుకున్నాడు.
Icon star #AlluArjun with wife #allusnehareddy and director @harish2you lands in #NewYork @alluarjun #AlluArjunArmy pic.twitter.com/Nezb6MwHUp
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) August 19, 2022

