Homeఎంటర్టైన్మెంట్Allu Arjun : శ్రీదేవి పర్సనల్ లైఫ్ పై అల్లు అర్జున్ కామెంట్స్! ఏమన్నారో తెలుసా?

Allu Arjun : శ్రీదేవి పర్సనల్ లైఫ్ పై అల్లు అర్జున్ కామెంట్స్! ఏమన్నారో తెలుసా?

Allu Arjun : ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా వెలుగొందింది శ్రీదేవి. తమిళనాడులో పుట్టిన శ్రీదేవి బాలనటిగా కెరీర్ ఆరంభించింది. అనంతరం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హోదా తెచ్చుకుంది. ముఖ్యంగా తమిళ్, తెలుగు భాషల్లో ఆమె చిత్రాలు చేసింది. బడా స్టార్స్ తో జతకట్టింది. శ్రీదేవి డేట్స్ దొరకడం అంటే అప్పట్లో గగనంగా ఉండేది. సౌత్ లో టాప్ హీరోయిన్ హోదా సొంతం చేసుకున్న శ్రీదేవి, నార్త్ పై కన్నేసింది. గతంలో బాలీవుడ్ నెంబర్ వన్ ఇండస్ట్రీగా ఉండేది. అక్కడ సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కేది. హిందీ నేషనల్ లాంగ్వేజ్ కావడంతో వివిధ రాష్ట్రాల్లో హిందీ సినిమాలు ఆడేవి.

Also Read : ఎన్టీఆర్ రెండో పెళ్లిని జనాలు అంగీకరించారా లేదా? ఇదిగో క్లారిటీ!

అయితే బాలీవుడ్ లో సక్సెస్ కావడం అంత సులభం కాదు. సౌత్ హీరోలు, హీరోయిన్స్ ని పెద్దగా ఆదరించరు. అలాగే బాలీవుడ్ నటులు, దర్శక నిర్మాతలు సైతం చిన్న చూపు చూసేవారు. ఆ టైం లో హిందీ పరిశ్రమలో అడుగుపెట్టి శ్రీదేవి సంచలనాలు చేసింది. పదుల సంఖ్యలో చిత్రాలు చేసింది. బాలీవుడ్ లో స్టార్ అయ్యాక శ్రీదేవి అక్కడే సెటిల్ అయ్యింది. అడపాదడపా తెలుగు, తమిళ్ చిత్రాలు చేసేది.

80-90లలో శ్రీదేవి కుర్రాళ్ళ కలల రాణిగా ఉండేది. ఆమెను అతిలోక సుందరిగా అభిమానులు అభివర్ణించేవారు. దర్శకులు, నిర్మాతలు, హీరోలు కూడా ఆమె అందం గురించి ప్రత్యేకంగా పొగిడిన సందర్భాలు ఉన్నాయి. కాగా శ్రీదేవిని ఆరాధించిన ప్రముఖుల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. ఆమె అంటే ఎనలేని అభిమానం, ప్రేమ అని అల్లు అర్జున్ వెల్లడించారు. ఇక శ్రీదేవి పెళ్లి తనను ఎంతగానో బాధించింది అట. బోని కపూర్ ని శ్రీదేవి వివాహం చేసుకుందన్న వార్త అల్లు అర్జున్ హార్ట్ బ్రేక్ చేసిందట. ఆమె చేసిన పని తనను మానసిక వేదనకు గురి చేసిందని అల్లు అర్జున్ అన్నారు.

బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ ని శ్రీదేవి ప్రేమ వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్ హోదాకు దగ్గరైంది. దేవర మూవీతో సౌత్ లో అడుగుపెట్టింది. ప్రస్తుతం రామ్ చరణ్ కి జంటగా పెద్ది మూవీ చేస్తుంది. ఇక చిన్న కుమార్తె ఖుషి కపూర్ సైతం నటిగా పరిచయం అయ్యింది. జాన్వీ కపూర్ ని సిల్వర్ స్క్రీన్ పై చూడకుండానే శ్రీదేవి కన్నుమూసింది. 2018లో దుబాయ్ హోటల్ లో జరిగిన ప్రమాదంలో శ్రీదేవి మరణించిన సంగతి తెలిసిందే.

Also Read : ‘గేమ్ చేంజర్’ ని దాటేసిన ‘హిట్ 3’..ఓవర్సీస్ లో మాస్ ర్యాంపేజ్!

Exit mobile version