Gopichand: విలన్ గా ప్రేక్షకుల్లో ఒక రేంజ్ ముద్ర వేసుకున్న హీరో గోపీచంద్(Gopichand), ఆ తర్వాత హీరో గా మారి, ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకొని, మాస్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న నటుడు గోపీచంద్. ఒకప్పుడు ఈయన సినిమాలకు మాస్ ప్రాంతాల్లో స్టార్ హీరోలకు వచ్చేంత ఓపెనింగ్ వసూళ్లు వచ్చేవి. టాక్ తో సంబంధం లేకుండా మొదటి వారం లోనే 90 శాతం బ్రేక్ ఈవెన్ స్టేటస్ ని అందుకునేవి. అలాంటి స్టార్ స్టేటస్ సంపాదించిన గోపీచంద్ కి ఈమధ్య కాలంలో అసలు హిట్ దొరకడం లేదు. తన తోటి హీరోలంతా అప్డేట్ అయ్యి సరికొత్త జానర్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ ఉంటే, గోపీచంద్ మాత్రం పాత చింతకాయ పచ్చడి సినిమాలు చేసుకుంటూ వరుస డిజాస్టర్స్ ని అందుకుంటున్నాడు.
Also Read : సెన్స్ ఉందా అసలు అంటూ రెచ్చిపోయిన మానస్..సంచలనం రేపుతున్న వీడియో!
ఆయన గత చిత్రం ‘విశ్వం’ పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది. కానీ ఇంకా పాత కాలపు కమర్షియల్ సినిమాలు చేస్తే ఇక గోపీచంద్ హీరో రోల్స్ ఆపేసి మళ్ళీ విలన్ రోల్స్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కమర్షియల్ సినిమాలు రాజ్యం ఏలుతున్న సమయంలో గోపీచంద్ చేసిన విన్నూతన ప్రయత్నం ‘సాహసం’. అప్పట్లో ఈ చిత్రాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది కానీ, ఈ కాలం లో అలాంటి సినిమా విడుదల అయ్యుంటే కచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ లో అద్భుతాలను సృష్టించి ఉండేది. గోపీచంద్ బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఇప్పటికీ అలాంటి థ్రిల్లర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. అందుకే గోపీచంద్ తన రూట్ ని మార్చి థ్రిల్లర్ జానర్ లో ఒక సినిమా చేయబోతున్నాడు. భారతీయ చరిత్రలో పలు కీలక ఘట్టాలను ఆధారంగా తీసుకొని భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత, జనసేన పార్టీ నాయకుడు BVSN ప్రసాద్ నిర్మిస్తున్నాడు.
మార్చి నెలలో మొదలైన ఈ సినిమాకు సంకల్ప్ రెడ్డి(Sankalp Reddy) దర్శకత్వం వహిస్తుండగా, మలయాళం నటి మీనాక్షి దినేష్ గా నటిస్తుంది. ఈ చిత్రం కాన్సెప్ట్ ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఏ డైరెక్టర్ కూడా ముట్టుకోలేదట. టీజర్ విడుదల తర్వాత ఈ సినిమా పై హైప్ కనీవినీ ఎరుగని రేంజ్ లో పెరుగుతుందని అంటున్నారు. అదే కనుక జరిగితే గోపీచంద్ కం బ్యాక్ ఈసారి టాలీవుడ్ లెవెల్ లో ఉండదు, పాన్ ఇండియన్ లెవెల్ లో ఉంటుంది. ఈయన తర్వాత వచ్చిన హీరోలు కూడా వందల కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొడుతూ వేరే లెవెల్ కి వెళ్లిపోతున్నారు. అలాంటిది మాస్ ఆడియన్స్ లో, ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఇమేజ్ ఉన్న గోపీచంద్ ఇంత క్రిందకి పడిపోవడాన్ని ఆయన అభిమానులు తట్టుకోలేకున్నారు, ఈ చిత్రంతో భారీ కం బ్యాక్ ఇస్తాడని బలంగా నమ్ముతున్నారు.