Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Advice To Star Heroes: ఆ స్టార్ హీరోలకు అదిరిపోయే సలహా ఇచ్చిన...

Allu Arjun Advice To Star Heroes: ఆ స్టార్ హీరోలకు అదిరిపోయే సలహా ఇచ్చిన అల్లు అర్జున్…

Allu Arjun Advice To Star Heroes: ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన నటుడు అల్లు అర్జున్… ఒకప్పుడు ఆయన క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ కే పరిమితమయ్యేది. కానీ ఎప్పుడైతే పుష్ప సినిమా వచ్చిందో అప్పటినుంచి పాన్ ఇండియాలో తన పేరు మారుమ్రోగిపోతుంది. తన నుంచి వచ్చే సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ సినిమా ప్రేక్షకులు సైతం అల్లు అర్జున్ కి వీరాభిమానులుగా మారిపోయారు. ప్రస్తుతం […]

Allu Arjun Advice To Star Heroes: ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన నటుడు అల్లు అర్జున్… ఒకప్పుడు ఆయన క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ కే పరిమితమయ్యేది. కానీ ఎప్పుడైతే పుష్ప సినిమా వచ్చిందో అప్పటినుంచి పాన్ ఇండియాలో తన పేరు మారుమ్రోగిపోతుంది. తన నుంచి వచ్చే సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ సినిమా ప్రేక్షకులు సైతం అల్లు అర్జున్ కి వీరాభిమానులుగా మారిపోయారు. ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఆయన బాటలోనే మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా నడుస్తుండటం విశేషం… మాస్ సినిమాలతోనే పాన్ ఇండియాకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అల్లు అర్జున్ భావించాడు. అందువల్లే అతనికి విపరీతమైన క్రేజ్ అయితే దక్కింది.

ఇక తనే కాకుండా తనకి అత్యంత క్లోజ్ గా ఉండే విజయ్ దేవరకొండ, నాని లకు సైతం మాస్ సినిమాలతో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వండని అల్లు అర్జున్ చెప్పాడట. అలా చేస్తేనే బాలీవుడ్ లో ఎక్కువ రీచ్ దక్కుతుందని చెప్పడట. ఆయన చెప్పినట్టుగానే ఈ హీరోలు మాస్ సినిమాలతో పాన్ ఇండియా బాట పట్టారు.

ఇక ఇప్పటివరకు విజయ్ దేవరకొండ చేసిన కింగ్ డమ్ మూవీ పాన్ ఇండియాలో ఏ మాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఇక నాని సైతం దసర సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికి అది వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు ప్యారడైజ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఈ మూవీ తో ఎలా మెప్పిస్తాడు అనేది తెలియాల్సి ఉంది. అలాగే విజయ్ దేవరకొండ సైతం ఇప్పుడు రౌడీ జనార్దన్, రణబాలి అనే సినిమాలతో తన సత్తా చాటుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది… మొత్తానికైతే అల్లు అర్జున్ ఈ యంగ్ హీరోలకు ఇచ్చిన ఒక సజెషన్ వల్ల వాళ్ళు పాన్ ఇండియా హీరోలుగా మారడానికి అవకాశం దొరికిందనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper