Homeబిజినెస్Realme 16 5G features: Realme ఫోన్ లీకులకు ఫిదా అవుతున్న యూత్.. అంతగా ఇందులో...

Realme 16 5G features: Realme ఫోన్ లీకులకు ఫిదా అవుతున్న యూత్.. అంతగా ఇందులో ఏముందంటే?

Realme 16 5G features: మొబైల్ మార్కెట్లో ఇప్పటికే ఎంతోమంది ఆదరణ పొందిన Realme సరికొత్త మొబైల్ ను త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతుంది.. అయితే దీని గురించి సమాచారం అధికారికంగా ఇవ్వనప్పటికీ ఈ కంపెనీ ఇచ్చే లీకులకు ఫోన్ ఎలా ఉందో తెలిసిపోతుంది. దీని గురించి తెలుసుకున్న యూత్ బాగా ఉపనస్ అవుతున్నారు. ఈ మొబైల్ చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండడంతోపాటు ఇందులో ఉండే ఫీచర్స్ తమకు అనుగుణంగా ఉంటాయని ఉత్సాహంగా చెబుతున్నారు. అయితే త్వరలో విడుదల కాబోతున్న ఈ మొబైల్ ధర ఎలా ఉండబోతుంది? ఇందులో ఆకట్టుకునే ఫీచర్లు ఏమేమి ఉన్నాయి?

Realme నుంచి 16 5G మొబైల్ 2026 ఏప్రిల్ నెలలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ మొబైల్లో ఇప్పటివరకు వచ్చిన ఫోన్లో కంటే అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు ఉన్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. ఇందులో 6.57 Full HD + AMOLED ఉండనుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఈ డిస్ప్లే తో మూవీస్ చూసేవారికి అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. అలాగే ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 6400 టర్బో ప్రాసెసర్ ఉండగా..8GB రామ్ సపోర్ట్ చేయనుంది. దీంతో మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసే వారికి సపోర్ట్ గా నిలుస్తుంది. అలాగే ఇందులో 512 GB వరకు స్టోరేజ్ కోసం అవకాశం ఉండడంతో కావాల్సిన ఫోటోలు, వీడియోలతో పాటు ఫైళ్లను స్టోర్ చేసుకోవచ్చు.

Also Read: త్వరలో కొత్త Redmi ఫోన్.. ఇప్పటివరకు ఉన్న బడ్జెట్ మొబైల్స్ కు చుక్కలే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో కంటెంట్లు సృష్టించే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇలాంటివారు మొబైల్ లో కెమెరా పనితీరు బాగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి వారికోసం ఈ కొత్త మొబైల్ లో 50 MP మెయిన్ కెమెరా సెట్ చేయనున్నారు. 12 MP అల్ట్రావైడ్ లెన్స్ తో డ్యూయల్ కెమెరా పనిచేస్తుంది. సెల్ఫీతో పాటు వీడియో కాలింగ్ కోసం 50 మెగా పిక్సెల్ తో కూడిన ఫోన్ ఉండనుంది. ఈ మొబైల్ లో బ్యాటరీ పనితీరు కూడా బలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 7000 mAh బ్యాటరీని చేర్చారు. ఇది 60 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో సపోర్ట్ చేయనుంది. అలాగే ఇందులో యూఎస్బీ టైప్ సి పోర్టు, ఏఐ ఫీచర్స్, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు యూత్ ను బాగా ఆకర్షిస్తాయి. ఇందులో యు ఐ 7.0 ఆధారిత ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం ఉండడంతో నేటి తరం వారు కావలసిన యాప్స్ ఉపయోగిస్తూ తమ పనులను సులభంగా నిర్వహించుకోవచ్చు.

అయితే ఈ మొబైల్ మార్కెట్లోకి రాకముందే దీని గురించి తీవ్రంగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా ధర ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఈ మొబైల్ వచ్చి రాగానే ఆదరణ పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular