Senior actor praises Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలందరు పాన్ ఇండియాని శాసించే స్థాయికి ఎదుగుతున్నారు. ఒక్కో సినిమాతో తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతుండడం విశేషం…ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న వారు మాత్రం చాలా తక్కువ సంఖ్యలు ఉన్నారనే చెప్పాలి… ఇక అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సైతం పుష్ప 2 (Pushpa 2)సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్లు కొల్లగొట్టి తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడు… ఇక రీసెంట్ గా జెన్నీ అనే ఒక సీనియర్ నటుడు అల్లు అర్జున్ గురించి అతని గొప్పతనాన్ని గురించి చాలా చక్కగా వివరించాడు. సన్నాఫ్ సత్యమూర్తి (Son of Satyamurthy) సినిమాలో ఇంటి ఓనర్ గా నటించిన జెన్నీ వాళ్ళను ఎప్పుడూ ఇబ్బంది పెడతాడు…బేసిగ్గా ఆ సినిమాలో అల్లు అర్జున్ అంత ఓపికపట్టుకుంటూ ఉంటాడు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా కోపిష్టి గా మారిపోయి జెన్నీ అనే నటుడిని కొడతాడు… ఆ కొట్టే సీన్ లో అల్లు అర్జున్ చేయి జెన్నీ కళ్ళజోడుకు తగిలి కళ్ళజోడు దూరంగా పడిపోయి విరిగిపోయిందట. అది చూసిన అల్లు అర్జున్ అతని మేనేజర్ ను పిలిచి ఈయనకి ఒక కళ్ళజోడు కొనిపించి పెట్టండి అని చెప్పారట.
Also Read: వాళ్లకు పిచ్చెక్కిస్తున్న డార్లింగ్ ప్రభాస్..! ఆయనకే క్లారిటీ లేదా?
దానికి జెన్నీ గారు వద్దండి అని చెప్పినప్పటికి లేదు మీరు చాలా సీనియర్ నటులు నా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను అది పొరపాటున చెయ్యాలా తగిలింది. ఏమనుకోకండి అంటూనే తనకి కళ్ళజోడు ఇప్పించాల్సిన బాధ్యత కూడా నాదే అంటూ అల్లు అర్జున్ చెప్పడంతో ఆయన కూడా కాదని లేకపోయారట. నేను కొత్త కళ్ళజోడు తీసుకోవాలంటే మీరు నాకు మీరు ఒక వరం ఇవ్వాలని చెప్పారట. ఏంటి అది అని అల్లు అర్జున్ అడగగా మీ ప్రతి సినిమాలో నాక ఒకు క్యారెక్టర్ ఇప్పించండి అని చెప్పాడట…
ఆయన అలా అనగానే అల్లు అర్జున్ అయ్యో అది పెద్ద వరమా? పక్కా ఇస్తాను అని చెప్పి ప్రస్తుతానికైతే కళ్ళజోడు తీసుకోండి అంటూ అతనికి కళ్ళజోడు ఇప్పించారట. అలా ఆయన అనుకున్న చేసిన మిస్టేక్ ని సరిదిద్దుకంటూనే జెన్నీ ఏజ్ కి గౌరవం ఇచ్చారని అతనికి చాలా సంస్కారం ఉందని, అల్లుఅర్జున్ గురించి ఆయన చాలా గొప్పగా చెప్పాడు. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది…
Also Read: అఖండ 2తో భారీ రిస్క్ చేస్తున్న బాలయ్య, సాధ్యమయ్యే పనేనా?
ఇది చూసిన అల్లు అర్జున్ అభిమానులు మా భాయ్ కి చాలా మంచి మనసు ఉంది. ఆయన ఎవరిని దూరం పెట్టడం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చూస్తుంటాడు. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ తెలియకుండా జరిగినప్పుడు కూడా వాళ్ళని చాలా బాగా చూసుకుంటాడు అంటూ వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు…