Homeఎంటర్టైన్మెంట్సెలెబ్రేషన్స్ కేన్సిల్ చేసిన బన్నీ

సెలెబ్రేషన్స్ కేన్సిల్ చేసిన బన్నీ


మార్చ్ 28 వ తారీకు బన్నీ కెరీర్ లో ఒక ప్రాముఖ్యం ఉన్న రోజు. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం బన్నీ నటించిన తొలి చిత్రం ” గంగోత్రి ” ( మార్చ్ 28, 2003 ) విడుదల అయ్యింది. ఆనాటి నుచి మొదలైన అల్లు అర్జున్ కెరీర్ ఇప్పటికి 20 సినిమాలకు చేరింది వాటిలో 14 సినిమాలు హిట్ మెట్లెక్కాయి. కేవలం ఆరు సినిమాలు జస్ట్ యావరేజ్ దగ్గర ఆగిపోయాయి . కానీ బన్నీచిరకాల వాంఛ అయిన ఇండస్ట్రీ హిట్ ఈ ఏడాది వచ్చింది.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా అల్లు అర్జున్ , త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ” అల వైకుంఠ‌పుర‌ములో” మూవీ అల్లు వారి వారసుడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమా స‌క్సెస్‌ను బ‌న్నీ వీలైన ప్ర‌తి సంద‌ర్భంలో బాగా సెల‌బ్రేట్ చేసుకున్నాడు. అంతే కాకుండా ఈ ఏడాది బ‌న్నీ హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసి 17 సంవత్స‌రాలు పూర్త‌య్యాయి. దీన్ని అల్లు అర్జున్ తండ్రి ప్ర‌ముఖ నిర్మాత అయిన అల్లు అర‌వింద్ గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేయాల‌ని అనుకున్నాడు. అందుకోసం బ‌న్నీతో సినిమాలు చేసిన ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల‌కు ఆహ్వానం పంపారు కూడా. అయితే ఊహించని రీతిలో క‌రోనా ప్ర‌భావంతో సినిమా ఫంక్షన్స్ అన్నీ ఆగిపోయాయి. అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. ఈ సంద‌ర్భంలో వేడుక‌లు జరిపితే బాగుండదని బ‌న్నీ 17 ఇయ‌ర్స్ సెల‌బ్రేష‌న్స్‌ను క్యాన్సిల్ చేసేశారు.

అయితే బ‌న్నీ త‌న 17 ఇయ‌ర్స్ ఆప్ కెరీర్ సెల‌బ్రేష‌న్స్‌ను తన కుటుంబానికి పరిమితం చేసి త‌న కుమారుడు అయాన్‌, కూతురు అర్హ‌తో క‌ల‌సి కేక్ క‌టింగ్ చేసుకొని సెలబ్రేష‌న్స్ చేసుకున్నాడ‌ట‌. ఆ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది .

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version