Homeఎంటర్టైన్మెంట్Allu Aravind : ఆడవాళ్లను 'బొద్దింక' తో పోల్చిన అల్లు అరవింద్..వీడియో వైరల్!

Allu Aravind : ఆడవాళ్లను ‘బొద్దింక’ తో పోల్చిన అల్లు అరవింద్..వీడియో వైరల్!

Allu Aravind : గీతా ఆర్ట్స్(Geetha Arts) సంస్థ ప్రస్తుతం ఎంత ఊపు మీద ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతకు ముందు గీతా ఆర్ట్స్ లో కేవలం మెగా హీరోల సినిమాలు మాత్రమే నిర్మాణం అయ్యేవి. కానీ ఎప్పుడైతే ఈ సంస్థల్లోకి బన్నీ వాసు ఎంట్రీ ఇచ్చాడో, అప్పటి నుండి ఇతర హీరోల సినిమాలు కూడా విడుదలయ్యాయి. అదే విధంగా ‘ఆహా’ యాప్ వచ్చిన తర్వాత గీతా ఆర్ట్స్ బ్రాండ్ విలువ మరింత పెరిగింది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ‘తండేల్’ సక్సెస్ తో మంచి ఊపు మీదున్న గీతా ఆర్ట్స్ సంస్థ, ఇప్పుడు శ్రీ విష్ణు(Sri Vishnu) ని హీరో గా పెట్టి ‘సింగల్'(Single Movie) అనే కామెడీ ఎంటర్టైనర్ ని తెరకెక్కించింది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 9 వ తారీఖున విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేశారు.

Also Read : రామ్ చరణ్ నాకు కొడుకు లాంటోడు..ఉద్దేశపూర్వకంగా చేయలేదు..దయచేసి క్షమించండి’ అంటూ అల్లు అరవింద్ ఎమోషనల్ కామెంట్స్!

ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీ విష్ణు కి మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ రాబోతుందని ఈ ట్రైలర్ ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ లో అమ్మాయిలను బొద్దింక తో పోల్చే డైలాగ్ ఒకటి ఉంటుంది. దీనిపై ఎవరో ఒకరు భవిష్యత్తులో వివాదాలకు తెరదీసే అవకాశం ఉండడం తో, ఆ డైలాగ్ ని ఎందుకు వాడాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్. ఆయన మాట్లాడుతూ ‘ఈ ప్రపంచం లో ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలైనా, తట్టుకొని నిలబడగలిగే సత్తా కేవలం బొద్దింక కు, ఒక మహిళకు మాత్రమే ఉంది. అందుకే మేము ఆడవాళ్లను బొద్దింక తో పోల్చాము.. దయచేసి దీనిని వివాదం చేయకండి’ అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్(Allu Aravind).

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘తండేల్ లాంటి సీరియస్ సబ్జెక్టు చేసిన తర్వాత, ఒక మంచి కామెడీ ఎంటెర్టైనెర్ చేయాలని అనిపించింది. తండేల్ స్టోరీ సిట్టింగ్స్ లో ప్రతీ రోజు మా మధ్య సీరియస్ చర్చలు జరిగేవి. ఎంతసేపు ఇవే చర్చలు విసుగొచ్చి తదుపరి చిత్రం కామెడీ జానర్ లో చేద్దామని అనుకున్నాము. అనుకున్నట్టుగానే ‘సింగల్’ చిత్రాన్ని తీసాము. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ప్రారంభం నుండి చివరి వరకు నవ్వుతూనే ఉంటారు, మీ పొట్ట చెక్కలు అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్. ఈ చిత్రం లో హీరోయిన్స్ గా ఇవానా, కేతిక శర్మ లు నటించారు. ట్రైలర్ లో ఇద్దరి హీరోయిన్స్ ని సమానంగా చూపించారు కానీ, థంబ్ నైల్ లో మాత్రం కేవలం ఇవానా ని మాత్రమే పెట్టారు. దీంతో మెయిన్ హీరోయిన్ ఆమేనా అని అంటున్నారు నెటిజెన్స్.

Also Read : సోషల్ మీడియా లో తనపై వస్తున్న ట్రోల్స్ పై అల్లు అరవింద్ షాకింగ్ రియాక్షన్..మెగా ఫ్యాన్స్ ని మళ్ళీ గిల్లేశాడుగా!

Ace Producer Allu Aravind Speech | #Single Trailer Launch Event | Sree Vishnu, Ketika Sharma, Ivana

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version