Kannappa : మంచు విష్ణు(Manchu Vishnu) తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప'(Kannappa Movie). ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు మంచు కుటుంబం సంపాదించిన డబ్బులు మొత్తం ఈ చిత్రం మీదనే ఖర్చు చేశారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మంచి విష్ణు కి రెండు దశాబ్దాలు పూర్తి అయ్యింది. కానీ ఇప్పటి వరకు తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకోలేకపోయాడు. మోహన్ బాబు లాంటి లెజెండ్ కుమారుడికి ఇది చాలా పెద్ద అవమానం. అందుకే ఆయన కన్నప్ప చిత్రాన్ని తన డ్రీం ప్రాజెక్ట్ గా భావించి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ VFX వర్క్ క్వాలిటీ విషయం లో చిన్న రిమార్క్స్ రావడంతో జూన్ 27 కి వాయిదా వేశారు.
Also Read : ప్రభాస్ కోసమే కన్నప్ప చూస్తారా..? ఆయన స్క్రీన్ టైమ్ ఎంతంటే..?
ఈ చిత్రం లో రెబెల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas), అక్షయ్ కుమార్(Akshay Kumar), మోహన్ లాల్(Mohanlal) వంటి సూపర్ స్టార్స్ కీలక పాత్రలు పోషించిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే సినిమా విడుదలకు రెండు నెలలు సమయం ఉన్నప్పటికీ మంచు విష్ణు ఇప్పటి నుండే ప్రొమోషన్స్ కి భారీ ప్లాన్స్ వేసినట్టు తెలుస్తుంది. మన టాలీవుడ్ మూవీస్ కి నార్త్ అమెరికా లో ఎప్పటి నుండో అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయి. కాబట్టి ఈ చిత్రాన్ని అక్కడి నుండే ప్రొమోషన్స్ ని మే 8 నుండి ప్రారంభించాలని అనుకుందట మూవీ టీం. అందులో భాగంగా డల్లాస్, లాస్ ఏంజిల్స్, అమెరికా వంటి ప్రాంతాల్లో ఈవెంట్స్ ని ఏర్పాటు చేయాలని అంటుకుంటున్నారట మేకర్స్. అదే విధంగా న్యూ జెర్సీ లో ఒక రోడ్ షో ని కూడా నిర్వహించబోతున్నారట. మే 15 వరకు ఈ ఈవెంట్స్ ని అక్కడ జరిపించి ఇండియా కి తిరిగి రాబోతున్నారట.
ఇండియా కి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వరుస ఈవెంట్స్ ని నిర్వహించబోతున్నారట. అలా నెల రోజుల పాటు మంచు విష్ణు మరియు మూవీ ఫుల్ బిజీ గా ప్రొమోషన్స్ తో గడపబోతున్నారని తెలుస్తుంది. కేవలం ప్రొమోషన్స్ కి దాదాపుగా 30 కోట్లు ఖర్చు చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ, టీజర్స్ కి మాత్రం డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే నటీనటులు ఉన్నప్పటికీ, హీరో మంచు విష్ణు సరైన నటన కనబర్చినట్టుగా అనిపించలేదని టీజర్స్ ని చూసిన ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. టీజర్స్ ని చూసి ఇలాంటివి అంచనా వేయడం సరికాదని, కచ్చితంగా సినిమాలో బాగా చేసి ఉండొచ్చని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.
Also Read : ‘రాజా సాబ్’ ని దాటేసిన ‘కన్నప్ప’..ఊహించని వింత పరిణామం!