https://oktelugu.com/

Allu Arjun: చిన్నప్పుడు అల్లు అర్జున్ ను తక్కువ అంచనా వేసిన అల్లు అరవింద్…అసలేం జరిగిందంటే..?

ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ తొందర్లోనే ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : March 19, 2024 / 09:50 AM IST

    Allu Arjun and Allu Aravind

    Follow us on

    Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప(Pushpa) సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తాను చాటుకున్నాడు. అలాగే ఐకాన్ స్టార్ గా కూడా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకొని బాలీవుడ్ జనాలను విపరీతంగా అలరిస్తున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ తొందర్లోనే ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ చిన్నతనంలో ఉన్నప్పుడు వాళ్ల నాన్న అయిన అల్లు అరవింద్ ఆయన్ని చాలా తక్కువ చేసి చూసేవాడట. ఎందుకంటే అల్లు అర్జున్ కి చదువు పెద్దగా అబ్బలేదు.

    ఇక దానికి తోడు దేని మీద పెద్దగా ఫోకస్ చేసేవాడు కాదట. ఇక ఇలాంటి క్రమం లోనే అల్లు అర్జున్ ఏం చేసి బతుకుతాడు అనే విధంగా అల్లు అరవింద్ ఆయన విషయంలో చాలా బాధపడుతూ ఉండేవాడట. ఇక శిరీష్ విషయానికొస్తే ఆయన చదువుల్లో చాలా చురుగ్గా ఉండేవాడు. అలాగే ఏది చేసిన చాలా కాన్ఫిడెంట్ గా చేస్తూ ఉండేవాడట. ఇక అలాగే తన పెద్ద కొడుకు కూడా చాలా ఇంటిలిజెంట్ గా ఉండేవాడట. ఇక వీళ్ళిద్దరు ఎలాగైనా సెటిల్ అవుతారు. కానీ అల్లు అర్జున్ ఎలా అంటూ తనలో తాను ఎప్పుడూ మదన పడుతూ ఉండేవాడట.

    కానీ చిరంజీవి ఇచ్చిన ప్రోత్సాహంతో అల్లు అరవింద్ అల్లు అర్జున్ కి డాన్సులు, యాక్టింగ్ నేర్పించి తనని చిరంజీవి చేతుల మీదుగా ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు. ఇక మొత్తానికైతే గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పతో పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డమ్ ను అందుకున్నాడు. ఇక అల్లు అరవింద మిగిలిన ఇద్దరితో పోలిస్తే అల్లు అర్జున్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉండడమే కాకుండా ఆయన తన తండ్రి అయిన అల్లు అరవింద్ కి కూడా చాలా పేరుని తీసుకొచ్చాడు.