Allu Aravind shocking comments: సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా మెగా అభిమానుల సందడే కనిపిస్తుంది. ఎన్నో ఏళ్ళ నుండి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) అసలైన స్టార్ పవర్ ని బయటపెట్టే సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. రీ ఎంట్రీ తర్వాత ఆయన మూడు బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నాడు, మూడు సార్లు వంద కోట్ల షేర్ ని కొల్లగొట్టాడు, అయినప్పటికీ అభిమానుల్లో ఎక్కడో ఎదో తెలియని వెలతి. చిరంజీవి లో ఒకప్పటి కామెడీ టైమింగ్ ని చూడలేకపోతున్నామే, ఆయన రేంజ్ నటన కనిపించట్లేదే అని. కానీ అనిల్ రావిపూడి మెగాస్టార్ ని ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం ద్వారా మరోసారి వింటేజ్ మూడ్ లోకి తీసుకొచ్చి పెట్టాడంటే, ఇక మెగాస్టార్ ఆరంభం నుండి ఎండింగ్ వరకు వన్ మ్యాన్ షో తో దుమ్ము దులిపేసాడు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ ని చూసి అభిమానులే కాదు, ప్రేక్షకులు కూడా మురిసిపోతున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మీడియా తో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘సినిమా చూసి ఇప్పుడే వస్తున్నాను. నాలోని ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాను. బాస్ చించేసాడు. బాస్ ఈజ్ బాస్. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు చూసి ఆరోజుల్లో బయటకు వచ్చినప్పుడు మాలో కలిగిన ఆనందం, మరోసారి ఈ చిత్రం ద్వారా కలిగింది. డైరెక్టర్ గారు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సహా , డ్యాన్స్, కామెడీ టైమింగ్ ని తీసుకొచ్చేసరికి, ఏమి ఆలోచించారు అసలు, శబాష్ అనిపించింది. వెంకటేష్ గారి ఎంట్రీ, చిరంజీవి గారితో కాంబినేషన్ సన్నివేశాలు, క్లైమాక్స్ అదిరిపోయింది. సంక్రాంతికి పైసా వసూల్ సినిమా ఇది..రికార్డ్స్ ని లెక్కపెట్టుకోవడమే బ్యాలన్స్’ అంటూ అల్లు అరవింద్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
చాలా కాలం నుండి చిరంజీవి , అల్లు కుటుంబాల మధ్య విబేధాలు ఉన్నాయని, అల్లు అర్జున్ కారణంగా చీలికలు వచ్చాయని , సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగేది. అంతే కాదు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా లో ఫ్యాన్ వార్స్ తారా స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన జల్సా రీ రిలీజ్ కి అల్లు అర్జున్ ని ఎగతాళి చేస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సృష్టించిన బీభత్సం ఎలాంటిదో అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి అల్లు అరవింద్ ఇలా మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకునేలా చేసింది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
Boss is Boss#BlockBusterMSG
— MegaPower (@SandyDhanapala) January 12, 2026