Allu Aravind: సరిహద్దుల్లో నిలబడి గత రెండు మూడు రోజులుగా దాయాది దేశం పాకిస్తాన్ మనపై చేస్తున్న మిస్సైల్స్ మరియు థ్రోన్స్ దాడిని తిప్పికొడుతూ మన ఇండియన్ ఆర్మీ పోరాడుతున్న తీరుకి ఏమి చేసినా తక్కువే అవుతుంది. భయంకరమైన యుద్ధ మేఘాలు అలుముకుంటున్న ఈ సమయంలో కూడా మనమంతా స్వేచ్ఛ ఇళ్లల్లో పడుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నాము అంటే, అందుకు కారణం ఇండియన్ ఆర్మీ. అలాంటి వాళ్లకు ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం చెప్పండి?, జీవితాంతం వాళ్ళ పాదాలకు ఊడిగం చేసినా తప్పు లేదు. అయితే ఎవరికీ రానటువంటి ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టాడు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind). ఆయన నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్(Geetha Arts) నుండి నేడు శ్రీ విష్ణు(Sree Vishnu) హీరో గా నటించిన ‘సింగిల్'(#Single Movie) అనే చిత్రం విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది.
Also Read: స్టార్ క్రికెటర్ కి ధీటైన సమాధానం ఇచ్చిన రష్మిక..శభాష్ అంటున్న నెటిజెన్స్!
మార్నింగ్, మ్యాట్నీ షోస్ కి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు కానీ, పాజిటివ్ టాక్ కారణంగా ఫస్ట్ షోస్ నుండి అన్ని ప్రాంతాల్లో పికప్ అయ్యింది. కచ్చితంగా ఫుల్ రన్ లో కమర్షియల్ హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే ఈ చిత్రం నుండి వచ్చే లాభాల్లో కొంత భాగం ఇండియన్ ఆర్మీ కి డొనేషన్ ఇవ్వాలని అల్లు అరవింద్ నిర్ణయం తీసుకున్నాడు. కాసేపటి క్రితమే ఈ విషయాన్ని మీడియా కు అధికారికంగా ప్రకటించాడు. ఆయన చేసే సహాయం చాలా చిన్నదే కావొచ్చు, కానీ ఇండియన్ ఆర్మీ పడుతున్న కష్టాన్ని, వాళ్ళు చేసిన త్యాగాన్ని, మన కోసం పోరాడుతున్న తీరుని మెచ్చుకుంటూ ఎదో తనకు తోచిన సహాయం చేయాలనే మనస్తత్వం ఉండడం నిజంగా అభినందించ దగ్గ విషయం అంటూ సోషల్ మీడియా లో అల్లు అరవింద్ చేసిన ఈ గొప్ప పనికి నెటిజెన్స్ సెల్యూట్ చేస్తున్నారు.
ఇక సింగల్ చిత్రం విషయానికి వస్తే ఈ చిత్రం లో హీరోయిన్స్ గా కేతికా శర్మ, ఇవానా నటించారు. వెన్నెల కిషోర్ ఇందులో దాదాపుగా సెకండ్ హీరో గా కనిపించాడు. చాలా కాలం తర్వాత థియేటర్స్ లో నవ్వుకోదగ్గ సినిమా వచ్చిందని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే యుద్ధ వాతావరణం నేపథ్యం లో జనాలు బయటకు అడుగుపెట్టడానికి భయపడుతున్నారు. అందుకే ఓపెనింగ్స్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి కానీ, ఫస్ట్ షోస్ నుండి మంచి ఊపుని చూపిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు నాలుగు వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. రెండవ రోజు ఈ చిత్రం కచ్చితం పికప్ అవుతుంది అనేదానికి సూచిక ఇదేనంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.