Ugram Movie First Review: కెరీర్ ప్రారంభం నుండి కామెడీ పాత్రలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ వచ్చిన హీరోలలో ఒకడు అల్లరి నరేష్. ఆరోజుల్లో రాజేంద్ర ప్రసాద్ ఎలాంటి హీరోనో, నేటి తరం లో అల్లరి నరేష్ కూడా అలాంటి హీరో. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తో అల్లరి నరేష్ అంటే ఒక బ్రాండ్ అనే ఇమేజి ని ఏర్పాటు చేసుకున్నాడు.
కామెడీ కి ట్రేడ్ మార్క్ లాగా ఉండే అల్లరి నరేష్, ఈమధ్య ఆయన ఫ్యాన్స్ కి మరియు ఆడియన్స్ కి తనలోని కొత్త యాంగిల్ ని పరిచయం చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. తాను కామెడీ మాత్రమే కాదు, అన్ని ఎమోషన్స్ ని అద్భుతంగా పండించగలను అని తనని తాను నిరూపించుకుంటూ ‘నాంది’ సినిమా నుండి అల్లరి నరేష్ వెర్షన్ 2.O కి నాంది పలికాడు.
అలా తనలోని కొత్తకోణాలను ఆవిష్కరించే క్రమం లో భాగంగా రీసెంట్ గా ఆయన ‘ఉగ్రం’ అనే సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. ఇందులో అల్లరి నరేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ మరియు ట్రైలర్ లో ఆయనలోని మాస్ యాంగిల్ ని మనం చూడొచ్చు. భారీ యాక్షన్ సన్నివేశాలతో తన విశ్వరూపం చూపించేసాడు అల్లరి నరేష్. ఈ చిత్రం ఈనెల 5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సందర్భంగా అల్లరి నరేష్ ఇండస్ట్రీ లో కొంత మంది ముఖ్యమైన ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించి ఒక ప్రివ్యూ షో ని ఏర్పాటు చేసాడు.
ఈ ప్రివ్యూ షో ని చూసిన ప్రతీ ఒక్కరు అల్లరి నరేష్ ని పొగడ్తలతో ముంచి ఎత్తారు, చాలా సన్నివేశాల్లో ఆయన యాక్షన్ సీక్వెన్స్ లు చూసి భయపడిపోయారట. రేపు సినిమాని చూసిన ప్రేక్షకులకు కూడా అదే అనుభూతి కలగబోతుంది అనే నమ్మకాన్ని వ్యక్తం చేసారు ఈ షో ని చూసిన ప్రముఖులంతా. మరి ఆడియన్స్ నుండి కూడా అలాంటి రియాక్షన్ వస్తుందో లేదో చూడాలి.