https://oktelugu.com/

వైవిధ్యానికి ‘నాంది’ పలికిన అల్లరి నరేశ్

అల్లరి నరేశ్ అంటే కామెడీకి కేరాఫ్ అడ్రస్. దివంగత ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా వెండితెరకు పరిచయమైన నరేశ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పారుచుకున్నాడు. మొదట్లో అన్నీ కామెడీ సినిమాలే చేసినా.. ‘గమ్యం’తో తనలోని సిసలైన నటుడిని పరిచయం చేశాడు. కానీ, మళ్లీ కామెడీ వైపే నడిచిన అల్లరోడి సినిమా ప్రయాణం సాఫీగా సాగలేదు. రొటీన్‌ కామెడీ కథలతో దండయాత్రలు చేసినా అతనికి సరైన విజయాలు లభించలేదు. ఇక లాభం లేదనుకొని సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘మహర్షి’ […]

Written By:
  • admin
  • , Updated On : June 30, 2020 / 02:11 PM IST
    Follow us on


    అల్లరి నరేశ్ అంటే కామెడీకి కేరాఫ్ అడ్రస్. దివంగత ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా వెండితెరకు పరిచయమైన నరేశ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పారుచుకున్నాడు. మొదట్లో అన్నీ కామెడీ సినిమాలే చేసినా.. ‘గమ్యం’తో తనలోని సిసలైన నటుడిని పరిచయం చేశాడు. కానీ, మళ్లీ కామెడీ వైపే నడిచిన అల్లరోడి సినిమా ప్రయాణం సాఫీగా సాగలేదు. రొటీన్‌ కామెడీ కథలతో దండయాత్రలు చేసినా అతనికి సరైన విజయాలు లభించలేదు. ఇక లాభం లేదనుకొని సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘మహర్షి’ మూవీలో సీరియస్‌ పాత్రలో కనిపించి మెప్పించాడు. ఆ తర్వాత కొంత గ్యాప్‌ తీసుకున్నాక ఇప్పుడు తనలోని మరో వైవిధ్యమైన కోణాన్ని బయటపెట్టాడు. పూర్తిస్థాయి ఎమోషన్‌ కాన్సెప్ట్‌తో ‘నాంది’ అనే సినిమాలతో మళ్లీ ట్రాక్‌లో పడే ప్రయత్నం చేస్తున్నాడు. పోలీస్‌ స్టేషన్‌లో నరేశ్‌ నగ్నంగా కూర్చొని ఉన్న ఫొటోతో ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్‌ అయింది. ఇది నరేశ్‌ 57వ సినిమా.

    కేసీఆర్ కు కరోనా మరక.. వదిలేలా లేదుగా?

    తాజాగా నరేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ఈ మూవీ టీజర్ను రిలీజ్‌ విడుదలైంది. యువ హీరో విజయ్ దేవరకొండ సోషల్‌ మీడియాలో దీన్ని రిలీజ్ చేశాడు. ‘ఈ ప్రపంచాన్ని టీజర్ రూపంలో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. నరేశ్ అన్నా ఇందులో మీరు అద్భుతంగా ఉన్నారు’ అని ఈ సందర్భంగా విజయ్‌ అన్నాడు. 1.28 నిమిషాల నిడివి ఉన్న టీజర్ ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా ఉన్నాయి. విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో తప్పు చేయకుండానే శిక్ష అనుభవిస్తున్న ఈ ఖైదీ క్యారెక్టర్లో నరేశ్‌ నటన ఆకట్టుకుంది. జైల్లో నరేశ్‌ను చిత్ర హింసలకు గురి చేస్తారు. చివర్లో ‘ఒక మనిషి పుట్టడానికి కూడా తొమ్మిది నెలలే టైమ్‌ పడుతుంది. మరి, నాకు న్యాయం చెప్పడానికేంటి సార్.. ఇన్ని సంవత్సరాలు పడుతోంది’ అని నరేశ్‌ చెప్పిన డైలాగ్‌ ఆలోచింపజేసేలా ఉంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ లాయర్ ఆద్య పాత్రలో నటిస్తోంది. రాధా ప్రకాశ్‌గా ప్రియదర్శి, కిషోర్ అనే పోలీసు అధికారి పాత్రలో హరిశ్ ఉత్తమన్‌ నటిస్తున్నారు. ప్రవీణ్, దేవీ ప్రసాద్‌, విన‌య్ వ‌రమ్, సీఎల్‌ న‌ర‌సింహారావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ర‌మేష్‌రెడ్డి, చ‌క్రపాణి, రాజ్యల‌క్ష్మి, మ‌ణిచంద‌న‌, ప్రమోదిని తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఎస్‌వీ2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు.