కరోనా వైరస్ శాశ్వతంగా ఎపుడు తప్పుకొంటుందో ఎవరూ చెప్పలేక పోతున్నారు. .అలాంటి సమయంలో సినిమా ప్రదర్శనలు సజావుగా సాగుతాయన్నది అనుమానమే . సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సినిమా ప్రదర్శన జరగాలంటే అనేక ఇబ్బందులు తప్పవు. ఆ క్రమంలో చిత్ర ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఎలాయిస్తుందో అన్న సంశయం అందరిలో ఉంది ..సినిమా థియేటర్లు ఆపరేట్ చేయడానికి అనుమతులు లభించవన్న వార్తలు వస్తుండడంతో మల్టీప్లెక్స్ చైన్స్ మరియు ఎగ్జిబిటర్ అసోసియేషన్ ఒక చిత్రమైన ప్రతిపాదన చేస్తున్నాయి. కేవలం యాభై శాతం టిక్కెట్లు మాత్రమే అమ్మడం ద్వారా మూవీ ఆడిటోరియంలో సోషల్ డిస్టెన్స్ పాటించవచ్చునని ఆలోచన చేస్తున్నాయి .
అయితే అది ప్రాక్టికల్ గా సాధ్యమా ! సీటుకి సీటుకి మధ్య ఖాళీ ఎలా వదులుతారు ! ఒకవేళ వదిలితే సీటింగ్ కెపాసిటీ యెంత అని నిర్ణయిస్తారు ! తలుపులు పూర్తిగా మూసి ఉండే థియేటర్లలో, పూర్తి ఏసీ రన్ అవుతుండే ఆవరణలో వైరస్ నియంత్రణ సాధ్యమా ? ఇక థియేటర్లోకి వెళ్లే ముందు శానిటైజర్ చేతుల్లో వేస్తామని, జ్వరం ఉందో లేదో పరీక్షిస్తామని, వైరస్ సోకకుండా యాంటీ వైరస్ మందులు స్ప్రే చేస్తూ అందులోంచి ఆడియన్స్ ని పంపిస్తామని ప్రతిపాదనలు వస్తున్నాయి.
అయితే ఇవన్నీ ప్రాక్టికల్ గా కుదిరే పనులు కావు. మల్టీప్లెక్స్ థియేటర్లలో అయితే ఈ ఏర్పాట్లు చేయొచ్చు . కానీ సింగల్ స్క్రీన్స్ లో మాత్రం అసాధ్యం. అది కూడా బి ,సి సెంటర్ లు ఎక్కువ వుండే పల్లెటూళ్లలో మరీ కష్టం. పాపం ఎగ్జిబిటర్స్ తమ ఆలోచనలు బయట పెట్టారు బట్ ది బాల్ ఈజ్ విత్ గవర్నమెంట్ .