
కరోనా మహమ్మారి ధాటికి సినీ రంగం కకావికలమైంది. చాలా సినిమాల విడుదలలు ఆగిపోయాయి అలాగే అనేక సినిమాల షూటింగులు ఆగిపోయాయి. ఇపుడు అవుట్ డోర్ షూటింగులు వాటి షెడ్యూల్ ప్లేస్ లను మార్చు కొంటున్నాయి. దీంతో చాలా సినిమాల షూటింగ్ ల యొక్క ప్లానింగ్‌లో మార్పులు తప్పేట్లు లేవు. ఇక చిత్ర బృందాలు షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. విమాన ప్రయాణాల విషయంలో చాలా దేశాలు ఆంక్షలు పెట్టడం తో అన్ని చిత్రాలు తమ ఫారిన్ షెడ్యూళ్లను క్యాన్సిల్ చేసుకోక తప్పేలాలేదు .
అంతేకాదు దేశవ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాలలో కూడా షూటింగ్ జరిపే స్థితి కూడా లేదు. దీంతో కథ రీత్యా ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా.. ఆ వాతావరణాన్ని మన హైదరాబాద్ లోనే సెట్స్ వేసి సర్దుకోక తప్పనిసరి పరిస్థితి వచ్చింది . ప్రస్తుతం రెండు పెద్ద సినిమాలు ఆ రకం గానే హైదరాబాద్ లో షూటింగ్ జరిపేలా ప్రణాళిక రచిస్తున్నాయి ..
రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న” రౌద్రం రణం రుధిరం ” ( ఆర్ఆర్ఆర్ ) చిత్ర బృందం కూడా తమ తదుపరి షూటింగ్ ని పూణే లో జరిపేందుకు ప్లాన్ చేశారు. కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా ఆ షూటింగ్ హైదరాబాద్ లోనే జరగబోతోంది అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొంద బోయే చిత్రం యొక్క `మొరాకో `( ఫారెన్) షెడ్యూల్ కూడా ఆగిపోయింది. ఇపుడు హైదరాబాద్ లోనే ఆ సీన్లను చిత్రీకరిస్తారట .. ఈ రెండు చిత్రాలే గాక దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ,నాగశౌర్య హీరోగా రూపొందిస్తున్న నూతన చిత్రం యొక్క అమెరికా షెడ్యూల్ కూడా ఆపేసి ఏకంగా సినిమా కధనే మార్చేస్తున్నారు .