ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 143 కు చేరింది. వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గురువారం ఉదయం 9 గంటల సాయంత్రానికి 11 కొత్త కేసులు నమోదైనట్లు స్టేట్ కరుణ నోడల్ ఆఫీసర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,321మంది కి పరీక్షలు నిర్వహించగా 1,171 మందికి కరోనా నెగిటివ్ అని, 143 కరోనా పాజిటివ్ గా రిపోర్టులు అందాయని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఉన్న నాలుగు పరీక్షా కేంద్రాలకు అధనంగా గుంటూరు, కడపలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
గుంటూరు జిల్లాలో 20, నెల్లూరు జిల్లాలో 21, ప్రకాశం జిల్లాలో 17, కడప జిల్లాలో 16, కృష్ణా జిల్లాలో 23, పశ్చిమ గోదావరి జిల్లాలో 14, విశాఖపట్నం జిల్లాలో 11, తూర్పుగోదావరి జిల్లాలో 9, చిత్తూరు జిల్లాలో 9, అనంతపురం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 1 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.