https://oktelugu.com/

ప్రభాస్ కు జోడీ సెట్ చేసిన రాజమౌళి..!

దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సీరిసుల తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ‘బాహుబలి’ సీరీసులు ఇండియాలోనే కాకుండా విడుదలైన అన్నిచోట్ల కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెల్సిందే. ఈ మూవీతో తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ప్రభాస్ ‘సాహో’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కొత్త దర్శకుడు సుజిత్ హాలీవుడ్ రెంజ్లో ‘సాహో’ మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీతో తెలుగులో అనుకున్న […]

Written By: , Updated On : May 22, 2020 / 07:41 PM IST
Follow us on


దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సీరిసుల తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ‘బాహుబలి’ సీరీసులు ఇండియాలోనే కాకుండా విడుదలైన అన్నిచోట్ల కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెల్సిందే. ఈ మూవీతో తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ప్రభాస్ ‘సాహో’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కొత్త దర్శకుడు సుజిత్ హాలీవుడ్ రెంజ్లో ‘సాహో’ మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీతో తెలుగులో అనుకున్న విజయం సాధించకపోయినా బాలీవుడ్లో మాత్రం ఘన విజయం సాధించింది. అయితే రాజమౌళి డార్లింగ్ ప్రభాస్ పక్కన ఓ బాలీవుడ్ బ్యూటీని రికమెండ్ చేయడంతో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

దర్శక దిగ్గజం రాజమౌళి తాజా చిత్రం ‘RRR’. ఈమూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా, ఎన్టీఆర్ కొమురంభీం పాత్రల్లో నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈమూవీలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలివియా నటిస్తున్నారు. ఇందులో అలియా భట్ సీత క్యారెక్టర్లో నటిస్తుంది. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం ‘RRR’ షూటింగు వాయిదా పడింది. అయితే ఈ మూవీ షూటింగులో పాల్గొన్న అలియాభట్ నటనకు జక్కన్న ఫిదా అయ్యాడట. ఈనేపథ్యంలో ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీలో హీరోయిన్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి.

సైంటిఫిక్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీలో తన పక్కన ఎవరైతే బాగుంటుందని ప్రభాస్ రాజమౌళిని అడుగగా అలియాభట్ పేరు సూచించారని తెలుస్తోంది. దీంతో ప్రభాస్ కూడా అలియాభట్ అయితే బాగుంటుందని భావించాడట. ఈ విషయాన్ని నాగ్ అశ్విన్ కు చెప్పగా ఆమెను సంప్రదించారట. ప్రభాస్ పక్కన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి ‘రాధే’, ‘డియర్’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ మూవీని యూవీ క్రియేషన్ నిర్మిస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ప్రభాస్ నటించిన ‘సాహో’లో బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ నటించింది. ఈ జోడీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కాగా మరో బాలీవుడ్ భామ అలియాభట్ కు ప్రభాస్ ఛాన్స్ ఇవ్వడం ఆసక్తిని రేపుతోంది. దీనిపై చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేస్తుందో వేచి చూడాల్సిందే..!