కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న క్రమంలో ముంబైలో మళ్ళీ సినిమా షూటింగ్ లు శరవేగంగా మొదలైపోయాయి. ముఖ్యంగా బాలీవుడ్ పెద్ద సినిమాలు, షూటింగ్ కోసం సెట్ లను కూడా రెడీ చేసుకున్నాయి. వచ్చే వారం నుండి షూట్ ను మొదలుపెట్టాలని నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. దాంతో స్టార్లు కూడా ఒప్పుకున్న సినిమాలకు డేట్స్ ను ఎడ్జెస్ట్ చేస్తున్నారు.
అయితే, బాలీవుడ్ క్యూట్ బేబీ ‘అలియా భట్’ చేతిలో ప్రస్తుతం మూడు భారీ సినిమాలు ఉన్నాయి. వాటిల్లో ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఒకటి. సెకెండ్ వేవ్ తగ్గిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. చరణ్ – అలియా కలయికలో వచ్చే లవ్ సీన్స్ ను తెరకెక్కించాలనేది జక్కన్న ప్లాన్. కానీ అలియా మాత్రం మరో భారీ సినిమాకి జులై ఎండింగ్ వరకు డేట్స్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది.
పైగా వచ్చే వారం నుండి షూటింగ్ లో చేరేందుకు ‘అలియా భట్’ రెడీ అవుతుంది. అలియా ప్రధాన పాత్రలో మరో క్రేజీ నేషనల్ డైరెక్టర్ సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న ‘గంగూబాయి’ సినిమా కోసం అలియా జులై 29 వరకు డేట్స్ ఇచ్చింది. ఈ సినిమా షూట్ జూన్ 15 నుంచి స్టార్ట్ కానుంది. అంటే ఈ సినిమా పూర్తి చేసిన తర్వాతే, అలియా.. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో పాల్గొంటుంది అన్నమాట.
ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెలలో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ను మళ్ళీ మొదలుపెట్టాలని రాజమౌళి అనుకుంటున్నా.. అలియా కారణంగా వచ్చే నెలలో షూట్ మొదలయ్యేలా లేదు. ఈ సారి ఎలాగైనా ‘ఆర్ఆర్ఆర్’ను సింగిల్ షెడ్యూల్ లోనే కంప్లీట్ చేయాలనుకుంటున్న రాజమౌళి కల కూడా నెరవేరేలా లేదు. మొత్తానికి అలియా ఆర్ఆర్ఆర్ కి షాక్ ఇచ్చింది. ఇక ‘ఆర్ఆర్ఆర్’లో అలియా, సీత అనే పాత్రను పోషిస్తుంది. రామ్ చరణ్ కి ప్రియురాలి పాత్రలో అలియా అలరించబోతోంది.