
దేశీయ మార్కెట్లు మరోసారి అదరగొట్టాయి. రోజంతా లాభాల్లోనే కొనసాగాయి. సీఎస్ యూ బ్యాంకులు, మెటల్, ఫార్మా షేర్లు రాణించడంతో మరోసారి భారీ లాభాలు మూటగట్టుకున్నాయి. నిఫ్టీ 15,700 పాయింట్ల పైన ముగిసింది. ఉదయం 52,105 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. చివరికి 358.83 పాయింట్ల లాభపడి 52,300.47 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 102.40 పాయింట్లు లాభపడి 15,737.80 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.06 గా ఉంది.