https://oktelugu.com/

అమ్మడు చాలా బీజీ.. ‘ఆర్ఆర్ఆర్’ రెండునెలలే..! 

దర్శక దిగ్గజం రాజమౌళి తెరక్కెస్తున్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ మూవీలో నటిస్తున్నారు. దీంతో ఈ  సినిమా కోసం అటూ నందమూరి.. ఇటూ మెగా ఫ్యాన్స్ ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ శరవేగంగా షూటింగు జరుపుకుంటున్న క్రమంలో కరోనా ఎంట్రీతో సినిమా వాయిదా పడింది. ఇటీవలే షూటింగులు ప్రారంభమైనప్పటికీ ‘ఆర్ఆర్ఆర్’ మాత్రం ప్రారంభం కాలేదు. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 23, 2020 / 07:11 PM IST
    Follow us on

    దర్శక దిగ్గజం రాజమౌళి తెరక్కెస్తున్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ మూవీలో నటిస్తున్నారు. దీంతో ఈ  సినిమా కోసం అటూ నందమూరి.. ఇటూ మెగా ఫ్యాన్స్ ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

    ‘ఆర్ఆర్ఆర్’ మూవీ శరవేగంగా షూటింగు జరుపుకుంటున్న క్రమంలో కరోనా ఎంట్రీతో సినిమా వాయిదా పడింది. ఇటీవలే షూటింగులు ప్రారంభమైనప్పటికీ ‘ఆర్ఆర్ఆర్’ మాత్రం ప్రారంభం కాలేదు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ ను కరోనా నిబంధనలు పాటిస్తూ తెరకెక్కించడం కొంత ఇబ్బందికరంగా మారింది.

    జూన్లోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభించాలని జక్కన్న భావించారు. ఈక్రమంలో దర్శకుడు రాజమౌళి.. సంగీత దర్శకుడు కీరవాణిలు కరోనా బారిన పడటంతో సినిమా ప్రారంభం మళ్లీ వాయిదా పడింది. ఇటీవల వారిద్దరు కరోనాను జయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇక ఈ మూవీలో రాంచరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తోంది.

    రాంచరణ్ అల్లూరి సీతరామరాజు పాత్రలో నటిస్తుండగా.. సీత పాత్రలో అలియాభట్ నటిస్తోంది. అయితే అలియా భట్ బాలీవుడ్ సినిమాలతో బీజీగా ఉంది. జనవరి, ఫిబ్రవరిలో ఆమె కాల్షీట్లు ఖాళీ లేనట్లు తెలుస్తోంది. దీంతో అక్టోబర్, నవంబర్ నెలల్లో ‘ఆర్ఆర్ఆర్’ కోసం డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రాజమౌళి సైతం అక్టోబర్ నే షూటింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

    అలియాభట్.. రాంచరణ్ మధ్య వచ్చే సన్నివేశాలను తొలుత చిత్రీకరించేందుకు రాజమౌళి సన్నహాలు చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండు నెలల్లో అలియాభట్ సన్నివేశాలను పూర్తి చేసేలా ఆర్ఆర్ఆర్ టీం రెడీ అవుతోంది. పలుసార్లు వాయిదా పడుతూ వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఈసారైనా పట్టాలెక్కుతుందో లేదో వేచిచూడాల్సిందే..!