https://oktelugu.com/

Mehreen Viral: నడిరోడ్డుపై రెచ్చిపోయిన ‘మెహ్రీన్’.. వీడియో వైరల్

Mehreen Viral: ‘మెహ్రీన్ పిర్జాదా’ నడిరోడ్డుపై స్టెప్పులేసి అందర్నీ ఆకట్టుకుంది. ఆమె మరో అమ్మాయితో కలిసి తీన్‌మార్ స్టెప్ కి ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది. పైగా తన డ్యాన్స్ వీడియోకి ‘పంజాబీ వెడ్డింగ్‌ సీన్స్‌’ అనే క్యాప్షన్స్‌ కూడా పెట్టింది. ఇంతకీ, అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల తన దగ్గర బంధువుల పెళ్లి వేడుకకు మెహ్రీన్ హాజరు అయ్యింది. ఈ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగానే ఆమె నడిరోడ్డుపై స్టెప్పులేసింది. పైగా పెళ్లి బరాత్‌ లో ఆమె వేసిన […]

Written By:
  • Shiva
  • , Updated On : June 25, 2022 / 04:32 PM IST
    Follow us on

    Mehreen Viral: ‘మెహ్రీన్ పిర్జాదా’ నడిరోడ్డుపై స్టెప్పులేసి అందర్నీ ఆకట్టుకుంది. ఆమె మరో అమ్మాయితో కలిసి తీన్‌మార్ స్టెప్ కి ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది. పైగా తన డ్యాన్స్ వీడియోకి ‘పంజాబీ వెడ్డింగ్‌ సీన్స్‌’ అనే క్యాప్షన్స్‌ కూడా పెట్టింది. ఇంతకీ, అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల తన దగ్గర బంధువుల పెళ్లి వేడుకకు మెహ్రీన్ హాజరు అయ్యింది. ఈ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగానే ఆమె నడిరోడ్డుపై స్టెప్పులేసింది.

    Mehreen

    పైగా పెళ్లి బరాత్‌ లో ఆమె వేసిన స్టెప్స్ తాలూకు వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. నిజానికి మెహ్రీన్ పెళ్లి కూడా ఈ పాటికి అయిపోవాల్సింది. సినిమాల్లో ఆమె కెరీర్ అంతా సజావుగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో.. మెహ్రీన్ పెళ్లి పై ఆశ పడింది. పైగా పెద్ద ఇంటి సంబంధం, ఇక తనకు తిరుగు లేదు అనుకుంది.

    Also Read: Alia Bhatt: ‘అలియా భట్’ భర్తకే కాదు, షారుఖ్ కి కూడా ఒప్పుకొంది !

    వచ్చిన భారీ ఆఫర్లను ఎడమ కాలితో ఛీ కొట్టింది. కట్ చేస్తే.. పెళ్లి పెటాకులు అయింది. ఇక చేసేది లేక, మళ్లీ సినిమాల్లో అవకాశాల కోసం రోజురోజుకు దిగజారిపోతూ ఉంది. ఐతే, ఆల్ రెడీ చేతులు కాలాయి. కాబట్టి ఈ బ్యూటీకి బొబ్బలెక్కేయి. ముందు జాగ్రత్తగా ఉంటే చేతులు కాలవు కదా. కాలిపోయిన తర్వాత అందరూ అనేమాటే ఇదే అంటూ మెహ్రీన్ తెగ ఫీల్ అయిపోతుంది.

    ఏది ఏమైనా ’దెప్పేవారికి దెప్ప సందు, అనేవారికి అన సందు’ అని సామెత గుర్తుకు వస్తోంది మెహ్రీన్ కెరీర్ ను చూస్తుంటే. ఏది ఎప్పుడు చెయ్యాలో అప్పుడే చెయ్యాలి”. ”చేతులు కాలేకా అకులు పట్టుకుని ఉపయోగం లేదు, అలా పట్టుకుంటేనే బొబ్బలెక్కుతాయి’. మెహ్రీన్ ఇప్పటికైనా ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

    Mehreen

    అవకాశాల కోసం మరీ దిగజారిపోకుండా ఓపికతో ఎదురు చూడాలి. ఆ మధ్య మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ సరసన మెహ్రీన్ ఒక సినిమా చేసింది. ఆ సినిమా దెబ్బతో మెహ్రీన్ కి మీడియం రేంజ్ హీరోలు ఛాన్స్ లు ఇవ్వడం మానేశారు. ఒక్క రాంగ్ స్టెప్ స్థాయిని తగ్గించింది. ఇప్పుడు కూడా అవకాశాలు లేవు. అలా అని స్థాయిని తగ్గించే సినిమా చేస్తే.. అసలుకే మోసం వస్తోంది.

    ‘మెహ్రీన్’ కెరీర్ అసలే అంతంత మాత్రంగా సాగుతుంది. ఇలాంటి టైమ్ లో ఏ హీరోయిన్ అయినా వచ్చిన అవకాశాలను ఒడిసి పట్టుకోవాలని ఆరాట పడుతుంది. పనిలోపనిగా ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తుంది. ‘మెహ్రీన్’ కూడా అలాగే ఆరాట పడుతుంది, ఉత్సాహ పడుతుంది. ఆమె ఆశ నిరాశ కాకుండా ఉండాలని కోరుకుందాం.

    Also Read:Rolls Royce- Garbage Trucks: ‘రోల్స్‌ రాయిస్‌’తో రోడ్లు ఊడ్పించాడు.. కంపెనీపై పగ తీర్చుకున్న ఇండియన్‌ కింగ్‌!

    Tags