ఆస్కార్ ఆహ్వానం.. ఇండియా నుంచి ఎవరికంటే?

ఆస్కార్ పురస్కారం. ప్రపంచ సినీ రంగంలో అత్యున్నత అవార్డు. ప్రతి ఆర్టిస్టు చిరకాల స్వప్నం. జీవితంలో ఒక్కరైనా ఆస్కార్ అందుకోవాలని ప్రతి ఒక్క నటి, నటుడు, సాంకేతిక నిపుణులు ఆశిస్తారు. కానీ, ఆ అవార్డు హాలీవుడ్‌తో పాటు, కొరియా లాంటి కొన్ని ఇండస్ట్రీల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ప్రతి ఏటా ఈ అవార్డు అందుకునేవాళ్లలో ఆ పరిశ్రమ వాళ్లే ఉంటారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న భారతీయ సినిమా రంగానికి వచ్చిన ఆస్కార్ అవార్డులు వేళ్ల మీద […]

Written By: admin, Updated On : July 2, 2020 1:35 pm
Follow us on


ఆస్కార్ పురస్కారం. ప్రపంచ సినీ రంగంలో అత్యున్నత అవార్డు. ప్రతి ఆర్టిస్టు చిరకాల స్వప్నం. జీవితంలో ఒక్కరైనా ఆస్కార్ అందుకోవాలని ప్రతి ఒక్క నటి, నటుడు, సాంకేతిక నిపుణులు ఆశిస్తారు. కానీ, ఆ అవార్డు హాలీవుడ్‌తో పాటు, కొరియా లాంటి కొన్ని ఇండస్ట్రీల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ప్రతి ఏటా ఈ అవార్డు అందుకునేవాళ్లలో ఆ పరిశ్రమ వాళ్లే ఉంటారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న భారతీయ సినిమా రంగానికి వచ్చిన ఆస్కార్ అవార్డులు వేళ్ల మీద లెక్కెట్టొచ్చు. అప్పుడెప్పుడో 1983లో విడుదలైన ‘గాంధీ’ సినిమాకు బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్గా భాను అతైయ తొలిసారి ఆస్కార్ అందుకుంటే… ప్రఖ్యాత మ్యూజిక్‌ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ చివరగా 2008లో రెండు అవార్డులు (స్లమ్‌డాగ్‌ మిలియనీర్ చిత్రానికి) గెలుచుకున్నాడు. ఈ పురస్కారాలకు మన సినిమాలు నామినేట్‌ అవ్వడమే గర్వంగా భావిస్తుంది మన పరిశ్రమ. కనీసం ఈ అవార్డుల వేడుకలకు హాజరైతేనే అదృష్టం అని నటీ నటులు భావిస్తారు.

హైదరాబాద్ లో నో-లాక్‌డౌన్.. కారణాలివే?

ఈ సారి ఆ అదృష్టం పలువురు బాలీవుడ్‌ ప్రముఖులను వరించింది. ఆ గౌరవం బాలీవుడ్‌ స్టార్ హృతిక్‌ రోషన్‌, యువ నటి ఆలియా భట్‌తో పాటు కాస్ట్యూమ్‌ డిజైనర్ నీతూ లుల్లా, కాస్టింగ్‌ డైరెక్టర్ నందినీ శ్రీకెంట్, డాక్యుమెంటరీ ప్రొడ్యూసర్స్‌ నిషితా జైన్, అమి మధేషియా, విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్ వైజర్స్‌ విశాల్ ఆనంద్‌, సందీప్‌ కమల్‌లకు దక్కింది. ఈ మేరకు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 25న జరిగే 93వ ఆస్కార్ వేడుకకు రావాలని వీరికి ఆహ్వానం అందింది. సాధారణంగా ఏటా ఫిబ్రవరిలో జరిగే ఈ కార్యక్రమం కరోనా కారణంగా వచ్చే ఏడాది రెండు నెలలు ఆలస్యం కానుంది. దీన్ని నిర్వహించే అకాడెమీ ఆఫ్‌ మోషన్ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైనెన్స్‌ ప్రతి ఏటా వివిధ దేశాల నుంచి ప్రముఖలను ఆహ్వానించడం ఆనవాయితీ. ఈ ఏడాది 819 మందితో లిస్ట్‌ రెడీ చేయగా.. మన దేశం నుంచి హృతిక్, ఆలియా సహా ఎనిమిది మందికి ఆ చాన్స్‌ దక్కింది.