కొద్దిరోజులుగా భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఇరుదేశాల మధ్య చర్చలు జరుపుతున్న క్రమంలోనే గాల్వానా లోయలో ఇరుదేశాల మధ్య ఘర్షణ చోటుచేసుకోంది. జూన్ 15న రాత్రి 3గంటల సమయంలో చైనా సైన్యం భారత జవాన్లను పక్కా ప్లాన్ తో కర్రలు, రాళ్లతో దొంగదెబ్బ తీశారు. ఈ దాడి నుంచి వెంటనే తెరుచుకున్న భారత జవాన్లు వారిని సరిహద్దుల నుంచి తరిమికొట్టారు. అయితే ఈ సంఘటనలో భారత జవాన్లు 21మంది మృతిచెందారు. భారత జవాన్ల వీరోచిత పోరాటాన్ని స్మరిస్తూ భారతీయులంతా వారికి ఘనంగా నివాళ్లర్పించారు.
టీడీపీ నేతల దృష్టిలో ఆంబులెన్సులన్నీ గ్రాఫిక్స్ ?
ఈ ఘటన తర్వాత సరిహద్దుల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కేంద్రం కూడా భారత జవాన్ల మృతిని సీరియస్ గా తీసుకుంది. కేంద్రం చైనాకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమవుతోంది. చైనాను ఆర్థికంగా, దౌత్యపరంగా, రక్షణపరంగా చావుదెబ్బ తీసేందుకు మోడీ సర్కార్ యాక్షన్ ప్లాన్ చేస్తోంది. దీనిని ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇటీవల కేంద్రం చైనాకు చెందిన కాంట్రాక్టులను రద్దు చేసింది. తాజాగా చైనాకు చెందిన 59యాప్స్ ను నిషేధిస్తూ చైనాకు మరో షాకిచ్చింది.
హైదరాబాద్ లో నో-లాక్‌డౌన్.. కారణాలివే?
ఇదిలా ఉంటే గాల్వానా ఆ రాత్రి ఏం జరిగింది? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని ప్రముఖ నటుడు, దర్శకుడు మేజర్ రవి మూవీని తెరకెక్కించేందుకు సన్నహాలు చేస్తున్నాడు. ‘బ్రిడ్జ్ ఆఫ్ గాల్వన్’ పేరుతో సినిమాను రూపొందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో మలయాళ విలక్షణ నటుడు, సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించనున్నారని సమాచారం. ఈమేరకు దర్శకుడు రవి ఆయనను సంప్రదించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
గతంలోనూ వీరి ఇద్దరి కాంబినేషన్లో ‘1971 బియాండ్ బోర్డర్స్’ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. తాజాగా మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో గాల్వాన్ లోయ సంఘటన తెరకెక్కుతుండటం ఆసక్తిని రేపుతోంది. రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలవుతుందని సమాచారం. దేశభక్తి సినిమాలు తెరకెక్కించడంలో మంచిపేరున్న మేజర్ రవి ఈ సినిమాను తెరక్కిస్తుండటం ఆసక్తిని రేపుతోంది.