https://oktelugu.com/

ఎట్టకేలకు నితిన్ పెళ్లి డేట్‌ ఫిక్స్‌ !

కరోనా దెబ్బకు సినిమాలే కాదు నటీనటుల జీవితాలు కూడా మారాయి. వాళ్ల ప్లాన్స్‌ అన్నీ మారిపోయాయి. టాలీవుడ్‌ నటులు నిఖిల్ సిద్దార్థ్‌, దగ్గుబాటి రానా, నితిన్‌లే ఇందుకు ఉదాహరణలు. ఈ ఏడాదిలో వీళ్ల ముగ్గురి పెళ్లిళ్లు ఫిక్స్‌ అయ్యాయి. డబ్బు, హోదా దండిగానే ఉండడంతో వీళ్ల పెళ్లి ఈ వేడుకులు అంగరంగ వైభవంగా జరగాలి. కానీ, కరోనా అది కుదరదు అంటోంది. లాక్‌డౌన్‌ రూల్స్‌ పాటిస్తూ నిఖిల్‌ పెళ్లి ఇప్పటికే చాలా సింపుల్‌గా జరిగిపోయింది. ఆగస్టులో రానా […]

Written By:
  • admin
  • , Updated On : July 2, 2020 1:25 pm
    Follow us on


    కరోనా దెబ్బకు సినిమాలే కాదు నటీనటుల జీవితాలు కూడా మారాయి. వాళ్ల ప్లాన్స్‌ అన్నీ మారిపోయాయి. టాలీవుడ్‌ నటులు నిఖిల్ సిద్దార్థ్‌, దగ్గుబాటి రానా, నితిన్‌లే ఇందుకు ఉదాహరణలు. ఈ ఏడాదిలో వీళ్ల ముగ్గురి పెళ్లిళ్లు ఫిక్స్‌ అయ్యాయి. డబ్బు, హోదా దండిగానే ఉండడంతో వీళ్ల పెళ్లి ఈ వేడుకులు అంగరంగ వైభవంగా జరగాలి. కానీ, కరోనా అది కుదరదు అంటోంది. లాక్‌డౌన్‌ రూల్స్‌ పాటిస్తూ నిఖిల్‌ పెళ్లి ఇప్పటికే చాలా సింపుల్‌గా జరిగిపోయింది. ఆగస్టులో రానా వివాహ వేడుక కూడా అతి తక్కువ మంది సమక్షంలో జరగనుంది. ఇప్పుడు నితిన్‌ పెళ్లి కూడా అలానే జరగనుంది.

    హైదరాబాద్ లో నో-లాక్‌డౌన్.. కారణాలివే?

    నిఖిల్, రానా సంగతి ఎలా ఉన్నా ఈ విషయంలో నితిన్‌ది బ్యాడ్‌ లక్‌ అనాలి. ఎందుకంటే తన ప్రేయసి షాలినితో అతను ఫిబ్రవరిలోనే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. ఏప్రిల్‌ 16న దుబాయ్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేసుకున్నాడు. ఇంతలో కరోనా రావడంతో దాన్ని వాయిదా వేసుకున్నాడు. అయినా సరే పరిస్థితులు చక్కబడిన తర్వాత ధూంధాంగా పెళ్లి చేసుకుందామని చాన్నాళ్లే వెయిట్‌ చేశాడు. కానీ, కరోనా వైరస్‌ ఉధృతి తగ్గడం లేదు. హైదరాబాద్‌లో వీర లెవెల్లో విజృంభిస్తోంది. ఫారిన్‌కు వెళ్లే చాన్స్‌ లేదు. ఇండియాలోనే ఇతర నగరాలకు వెళ్లి డెస్టినేషన్‌ వెడ్డింగ్ ప్లాన్‌ చేద్దామంటే ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో అతిథులు రిస్క్‌తో కూడిన ప్రయాణాలు చేసే అవకాశం లేదు. పోనీ ఇంకొంత సమయం వేచి చుద్దామా అంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడం లేదు. దాంతో ఈ నెలలోనే పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించారు. ఈ నెల 26న ముహూర్తం ఫిక్స్‌ చేసినట్టు తెలుస్తోంది. పెళ్లి కూడా నగర శివారులోని ఓ ఫామ్ హౌజ్‌లో లేదంటే వధువు ఇంటి దగ్గరే జరిపిస్తారాట. లాక్‌డౌన్‌ నిబంధనల ప్రకారం అతి కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరవుతారని సమాచారం.